విజయ్ మాట్లాడుతూ యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు చాలా పెద్ద కలలు ఉండేవి పెళ్లి చూపుల సినిమాతో ప్రయాణం చిన్నగా మొదలు పెట్టాను అయితే ఆ చిత్రానికి ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించారు అప్పటినుంచి ప్రేమ పంచుతూనే ఉన్నారు హైదరాబాదు నుండి వెళ్లి ఇండియా మొత్తానికి ఒకే కథ చెప్పాలని కలగన్నాము అదే లైగర్ సినిమా అని తెలిపారు. ఇండియాలో ఎక్కడికి వెళ్లినా కూడా ప్రేమ లభిస్తూ ఉన్నదని కానీ ఎప్పుడూ మర్చిపోలేని ప్రేమ ఇక్కడి నుండి మొదలైందని తెలిపాడు.
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమా సమయంలో కాలేజీలో తిరుగుతుంటే అక్కడ ఉండే పిల్లలు ఇచ్చిన ప్రేమ మర్చిపోలేను అని తెలిపారు. లైగర్ సినిమా మీద కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము ఈ సినిమా ఇండియా ని షేర్ చేస్తుందని తెలిపారు. అలాగే డాన్స్ అంటే తనకు ఏడుపు వస్తుంది అని నేను డాన్సర్ ని కాదు అని తెలిపారు కానీ లైకర్ కోసం డాన్సులు చేశాను ఇందులో అనన్య నన్ను చాలా భరించింది.. డాన్స్ టేకు మధ్యలో ఉంటే నాకు సరిగ్గా వచ్చేసరికి ఆమె అలసట పడేది అని తెలిపారు. అనన్య ఒక ముద్దు పిల్ల సినిమాల కోసం చాలా కష్టపడుతుందని తెలిపారు.