ఇక ఈ పార్టీని ఒక రేంజ్ లో హంగామా చేసినట్లు తెలుస్తోంది వీరితోపాటు యువనిర్మాత గని ఫేమ్ సిద్దు కూడా ఇందులో పాల్గొన్నారు. అంతేకాకుండా నితిన్ వైఫ్ షాలిని హీరోయిన్ లావణ్య త్రిపాఠి , కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కూడా ఇందులో పాల్గొన్నారు. ఇక అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. వరుణ్ తేజ్ నటించిన గణి చిత్రం ఇటీవలే బాక్సాఫీస్ దగ్గర తీవ్రమైన నిరాశను పరిచింది. ఇక ఈ చిత్రం అల్లుబాబి తో సిద్దు ప్రొడ్యూసర్ గా పరిచయం అయ్యారు. ఇక ఈ సినిమా భారీ నష్టాలను తెచ్చిపెట్టినట్లుగా తెలుస్తోంది.
ఈ మూవీ తర్వాత వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో ఒక భారీ యాక్షన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అయితే అది ఇప్పటికీ ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. దీంతో ఈ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా ఇలా ఉండగా హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఈనెల 12 దా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ కూడా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. ఇక సాయిధరమ్ తేజ కూడా ప్రస్తుతం హర్రర్ మూవీలో నటిస్తున్నారు.