మాస్ హీరో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ధమాకా.. త్రినాధ రావు డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. విచిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేకగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించడం జరుగుతోంది ఇంతవరకు తనదైన మార్కుతో కామెడీని మిక్స్ చేస్తూ లవ్ స్టోరీని తెరకెక్కించిన డైరెక్టర్ మొదటిసారిగా ఒక పూర్తి విభిన్నమైన కథతో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ సినిమా పైన ప్రేక్షకులకు మరింత ప్రత్యేకమైన ఆసక్తి కలుగుతున్నది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అనే సంకేతాలు అందిస్తూ వస్తున్నది చిత్ర బృందం.


ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీ లీలా నటిస్తున్నది ఇందులో ఫస్ట్ సాంగ్ జింతాక్ పోస్టర్తో మరింత ఆసక్తిని రేపింది. ఇక ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉన్న నేపథ్యంలో మేకర్స్ లిరికల్ వీడియో సాంగ్ తో మరింత ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ఇక అందుకు సంబంధించి రాజాగా ఒక అప్డేట్ ను కూడా విడుదల చేశారు. జింతాక జింతాక అంటే సాగే లిరికల్ వీడియో సాంగ్ ని ఈ రోజున చిత్ర బృందం విడుదల చేశారు. ఈ పాటకు సాహిత్యాన్ని కాసర్ల శ్యామ్ అందించారు.


ఈ సినిమాకి శేఖర్ డ్యాన్స్ కంపోజ్ చేసి ఈ పాటని మంగ్లీ అలరించారు. రాములో రాములో అంటూ జానపద గీతాన్ని దూరమా సాంగ్ చేసింది.. ఇప్పుడు ధమాకా కోసం జింతాక్ సాంగ్ ని అందించడం విశేషం. ఇక ఊర మాసుగా ఈ పాటని తెరకెక్కించడం జరిగినట్లు సమాచారం. మాస్ స్టెప్పులతో, రవితేజ శ్రీ లీలా ఈ పాటకి అద్భుతంగా డాన్స్ వేశారని చెప్పవచ్చు. ఇక థియేటర్లలో కూడా ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ఇక వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అదిరిపోయిందని చెప్పవచ్చు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: