ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమాతో పాటు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ సలార్ సినిమా షూటింగ్ చేస్తూ ఉన్నారు. ఇది దాదాపుగా 50% పూర్తి అయినట్లుగా తెలుస్తున్నది ఇక మూడవ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగ అశ్విన్ డైరెక్షన్లో సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టుకే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మూడు ప్రాజెక్టులు కూడా ఒక్కొక్కటి కొన్ని వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో తెరకెక్కిస్తున్నారు. ఆది పురుష దాదాపుగారూ. 500 కోట్ల రూపాయలకు పైన బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదే స్థాయిలో ప్రాజెక్టు కేను కూడా సిద్ధం చేస్తున్నారు సలార్ మాత్రం రూ. 200 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ చిత్రాలలో మినిమం బడ్జెట్ సినిమా చేయాలని భావించిన ప్రభాస్ డైరెక్టర్ మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపించాయి. కానీ పక్క కమర్షియల్ చిత్రం ప్లాప్ కావడంతో అడ్వాన్స్ ని తిరిగి తీసుకున్నట్లుగా కూడ వార్తలు వినిపించాయి. డైరెక్టర్ మారుతి అయితే తన సినిమాని చేయలేనని చెప్పినట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం స్టార్ డ్యామ్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ మారుతి డైరెక్షన్లో సినిమా కరెక్ట్ కాదని భావించడం వల్లే ఆ సినిమాని రిజెక్ట్ చేసినట్లుగా సమాచారం.