గత మూడు సంవత్సరాలకు ముందు కరోనా అనే మహమ్మారి కారణంగా సినిమా ఇండస్ట్రీ కుదేలైంది. దాదాపు రెండు సంవత్సరాల కాలం థియేటర్ లలో సినిమాలు ఆడలేదు. ఇది ఎంత నష్టం అన్నది మనము కళ్లారా చూశాము. ఆ సమయంలో సినిమాలకు బాగా అలవాటు పడిన ప్రేక్షకులు ఇంటిలోనే ఉంటూ ఓ టి టి లు మరియు యూట్యూబ్ లు చూస్తూ కాలం గడిపేయడానికి బాగా అలవాటుపడ్డారు. ఆ సమయంలో ప్రపంచంలోని వివిధ రకాల జానర్ ల సినిమాలను చూసి, సినిమా అంటే ఎలా ఉండాలో పూర్తి అవగాహన తెచ్చుకున్నారు. కట్ చేస్తే కరోనా పోయి మళ్ళీ థియేటర్ లలో యధావిధిగా సినిమాలు ప్రదర్శించడం స్టార్ట్ అయ్యాయి.

ఆ తర్వాత రిలీజ్ అయిన చాలా సినిమాలు కంటెంట్ లేకుండా మూడు ఫైట్ లు ఆరు పాటలు ఫార్ములాతో వచ్చినవి అన్నీ ప్రేక్షకాగ్రహానికి గురయ్యాయి. కథ బాగుంటేనే సినిమాను ఆదరించడానికి ప్రేక్షకులు ప్రిపేర్ అయ్యారు. ఎంత స్టార్ అయినా... ఎంత ప్రమోషన్స్ చేసినా సినిమా లో కంటెంట్ లేకుంటే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. అలా ప్లాప్ అయిన మూవీలలో చిరు రామ్ చరణ్ లు నాటికిఞ్హిన ఆచార్య, ప్రభాస్ నటించిన రాధే శ్యామ్, రవితేజ నటించిన ఖిలాడీ మరియు రామారావు ఆన్ డ్యూటీ, రామ్ నటించిన ది వారియర్, నితిన్ మాచర్ల నియోజకవర్గం లాంటి సినిమాలు అన్నీ కంటెంట్ లేకుండా వచ్చి బొక్క బోర్లా పడ్డాయి.

ఇక మంచి కంటెంట్ ను నమ్ముకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన బింబిసార, సీతారామం, కార్తికేయ 2 లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తమ ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి. అందుకే ఇకనైనా పాతరకం కథలకు స్వస్తి పలికి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకోకపోతే హీరోలు ఇక సినిమాలు తీయడం మానుకోవాల్సిందే. మరి చూద్దాం మన హీరోలలో ఇకనైనా మార్పు వస్తుందా ?  

మరింత సమాచారం తెలుసుకోండి: