టాలెంటు ఉన్న దర్శకులను ఆదరించడం మన తెలుగు సినిమా పరిశ్రమలోని హీరోలకు అలవాటే. ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉంటుందో ఎవరైతే వరుసగా విజయాలను అందిస్తూ ఉంటారో వారిని ఓడిసిపట్టి తమ సినిమాలను చేయవలసిందిగా వారికి భారీ భారీ ఆఫర్లు ఇస్తూ ఉంటారు. అలా ఇటీవల కాలంలో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు హీరోలు పెద్దపీట వేస్తున్నారు. అలాంటి సినిమాలు చేసే దర్శకులను ఏరుకోరి మరి తమ సినిమాలకు దర్శకులుగా ఎంచుకుంటున్నారు.
ఆ విధంగా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చిన దర్శకుడైన చందు మొండేటి ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు అని చెప్పవచ్చు. ఆయన స్వామిరారా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత హీరో నిఖిల్ తో కలిసి తన రెండవ సినిమా చేశాడు. అదే కార్తికేయ. అది ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ తరువాత చందు మొండేటి చేసిన ప్రేమమ్ కూడా భారీ విజయాన్ని అందుకుంది.
అయితే నాగచైతన్యతో కలిసి ఆయన చేసిన భారీ సినిమా సవ్యసాచి ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకులకు ముందుకు వచ్చి విఫలం అయింది. దాంతో కొంత సమయాన్ని తీసుకొని చందు ఇప్పుడు కార్తికేయ రెండవ భాగం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ దర్శకుడు తో సినిమా చేసే విధంగా హీరోలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే గీతా ఆర్ట్స్ సంస్థతో సినిమా చేస్తూ ఉండగా అందులో ఒక పెద్ద హీరో నటిస్తూ ఉండడం విశేషం. ఆ సినిమా తర్వాత ఈ దర్శకుడితో కలిసి చేయాలని ఎంతో మంది హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి మంచి సక్సెస్ రేట్ తో ముందున్న ఈ దర్శకుడు ఏ హీరోతో తన తదుపరి సినిమా చేస్తాడో చూడాలి.