ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో డీజే టిల్లు సినిమాకి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు ఈ ఏడాది మొదట విడుదలైన సినిమా జాబితాలలో సక్సెస్ గా నిలిచిన సినిమా ఇది అని చెప్పవచ్చు..డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ పనులు కూడా ఇటీవలే ప్రారంభమయ్యాయి డైరెక్టర్ కూడా మార్చార ని కొత్త దర్శకుడు ఎంపిక జరుగుతున్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి.. ఇక డీజే టిల్లు సినిమాలో హీరోయిన్గా నేహా శర్మ బాగా ఆకట్టుకుంది అయితే ఆమె నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పటికి రాధిక పాత్ర వింటే చాలు ప్రేక్షకులకు ఈ చిత్రం గుర్తుకు వస్తుంది అలాంటి.. రాధిక పాత్రలో మరొక హీరోన్ తో చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లుగా చిత్ర బృందం సమాచారం.


మొన్నటి మొన్న వరకు డీజే టిల్లు -2 లో రాధిక పాత్ర కోసం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఎంపిక చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా కార్తికేయ 2 సినిమాతో మంచి విజయాన్ని తప్పించుకున్నది అయితే డీజే టిల్లు -2 లో అనుపమ అదనపు ఆకర్షణగా నిలుస్తుంది అని అందరూ భావించారు. అయితే అనుహంగా సినిమాకు ఆమెను చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మరొకసారి ఇందులో హీరోయిన్ మారే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.


ఇప్పుడు ఆమె స్థానంలో పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీలా ను ఎంపిక చేశారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సిద్దు జొన్నలగడ్డకు జోడిగా శ్రీలీలా కన్ఫామ్ అయ్యిందని కూడా అందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తి అవుతున్నాయి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి కానీ కొందరు మాత్రం అనుపమ ఈ సీక్వెల్ లో నటించబోతోంది అంటూ చాలా గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఇంతకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరైతే బాగుంటుందా అనే సందేహంలో చిత్ర బృందం పడినట్లుగా తెలుస్తోంది. మరి ఈ చిత్రంపై ఎవరు నటిస్తారని విషయంపై చిత్ర బృందమే క్లారిటీ ఇవ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: