ఫ్యామిలీ మెన్ సీజన్ 2 లో ఈమె రాజీ పాత్రలో అద్భుతంగా నటించింది ఆ తర్వాత పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ లో నటించి ఉత్తరాది ప్రేక్షకులను ఒక ఊపు ఊపింది అని చెప్పవచ్చు సమంత ఇప్పటికిప్పుడు బాలీవుడ్లో సైతం నాలుగైదు సినిమాలలో సంతకాలు చేసి చాలా స్పీడ్ గా ఉన్నది ఇటీవల కాలంలో సమంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మరింత పెరిగిపోయింది. ఇక ఇటీవల కాఫీ విత్ కరణ్ షో లో మాట్లాడిన మాటలు అభిమానులను ఆకట్టుకునేలా చేసింది. ప్రస్తుతం ఇప్పుడు సమంత ఎక్కువగా పాన్ ఇండియా కథలను ఎంచుకుంటూ.. పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సంపాదించింది ప్రస్తుతం ఒక చిత్రానికి ఈమె 4 నుంచి 4.5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు సమాచారం.
ఇక ఇది సౌత్ ఇండియాస్ట్రీలోనే ఒక అరుదైన రికార్డ్ అని చెప్పవచ్చు అయితే సమంతకు ఓర్మాక్స్ 2022 జులై సర్వే ప్రకారం టాప్ 10 లో సమంత, ఆలియా, నయనతార ,కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్, పూజ హెగ్డే, రష్మిక కత్రినా కియారా వంటి వారు ఉన్నారు. బాలీవుడ్లో దీపిక ఆలియా కత్రినా కైఫ్ రేసులో వీరందరిని వెనుక నటి సమంత నెంబర్ వన్ స్థానంలో ఉన్నది. ప్రస్తుతం ఈ విషయం చాలా వైరల్ గా మారుతోంది.