ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు ఉన్నా పూరి జగన్నాథ్  కూ మాత్రం ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాలోని డైలాగులు ఎవరో రచయిత రాశారు అన్నట్లుగా కాదు ప్రేక్షకుడే వచ్చి చెప్పాడు ఏమో అన్నట్లుగా వుంటాయి అని చెప్పాలి. పూరి జగన్నాథ్ సినిమా లోని పాత్రలు ఎంతో ముక్కుసూటిగా మాట్లాడుకుంటూ ఉంటాయి అని చెప్పాలి.  ఇక పూరి సినిమా కోసం కథను సిద్ధం చేసుకునే విధానం.. పాత్రలను తన దర్శకత్వ శైలి తో మలిచే విధానం ప్రేక్షకులను ఎక్కువగా కట్టిపడేస్తు ఉంటుంది అని చెప్పాలి.


 ఇక తన సినిమాలతో ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు పూరిజగన్నాద్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక పూరీ జగన్నాథ్ తో ఒక సినిమా చేస్తే చాలు అని ఎంతోమంది హీరోలు వేచి చూసేవారు. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ అనే ఒక భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనే విషయం తెలిసిందే.ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నాడు ఈ దర్శకుడు. ఈ సందర్భంగా ఇటీవల ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు.


 మీ దర్శకత్వంలో ఇప్పటివరకు చాలానే సినిమాలు వచ్చాయి అయితే ఈ సినిమాలలో మీరు ఏ సినిమాకి సీక్వెల్ తీయాలని అనుకుంటున్నారు అంటూ ప్రశ్నించగా.. పూరి ఆసక్తికర సమాధానం చెప్పాడు. మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి, బిజినెస్ మాన్ సినిమాలకు సీక్వెల్ చేయాలని ఉంది అంటూ సమాధానం చెప్పాడు. ఈ రెండు సినిమాల్లో కూడా మహేష్బాబు పాత్ర ఎంతో పవర్ఫుల్గా ఉంటుందని ఇక ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్న అంటూ పూరి జగన్నాథ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు.. తప్పకుండా ఈ సినిమా సీక్వెల్ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు పూరి.

మరింత సమాచారం తెలుసుకోండి: