సాధారణంగా ఏ సినిమాలో అయినా సరే చివరిలో హీరో చనిపోతే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపరు. కానీ మరికొన్ని సినిమాలలో హీరోలు ఎండింగ్లో చనిపోతే ఆ సినిమాకు ప్రేక్షకులు పగ్గం కడతారని చెప్పడంలో సందేహం లేదు. అలా లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ మొదలుకొని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నాని ఇలా వీళ్ళందరూ కూడా సినిమా ఎండింగ్లో చనిపోయి మంచి విజయాన్ని సాధించారు. ఇక అలా సినిమాలలో చనిపోయే పాత్రలు చేసి మెప్పించిన స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు ఒకసారి చూసి తెలుసుకుందాం.

తరుణ్:
ఒక ఊరిలో అనే సినిమాలో తరుణ్ హీరోగా నటించాడు ఇందులో సలోని హీరోయిన్ గా నటించగా.. రాజా సెకండ్ హీరోగా నటించడం జరిగింది. ఇక ఈ సినిమాలో తరుణ్ పాత్ర చనిపోతుంది. ఇక ఆ విషయం ప్రేక్షకులకు డైజెస్ట్ కాకపోవడంతో సినిమా ఫ్లాప్ గా నిలిచింది.

మహేష్ బాబు:
శోభన్ దర్శకత్వంలో మహేష్ బాబు ఆర్తి అగర్వాల్ కలిసి నటించిన చిత్రం బాబీ. ఈ సినిమా క్లైమాక్స్లో మహేష్ బాబు పాత్ర చనిపోతుంది. ఇక హీరోయిన్ పాత్ర కూడా చనిపోతుంది. ఇక ఒకేసారి హీరో హీరోయిన్ల ఇద్దరు పాత్రలు చనిపోవడంతో సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది.

నాగార్జున:
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకుడిగా రాజన్న చిత్రంలో నాగార్జున పాత్ర చనిపోతుంది. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ప్రభాస్:
కృష్ణవంశీ దర్శకత్వంలో చార్మి, అసిన్,  ప్రభాస్ కలిసి నటించిన చిత్రం చక్రం. ఈ సినిమాలో కూడా ప్రభాస్ పాత్ర చనిపోతుంది. ఇక ఈ సినిమా పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది.


ఎన్టీఆర్:
ఆంధ్రావాలా, జై లవకుశ , యమదొంగ చిత్రాలలో ఎన్టీఆర్ పోషించిన పాత్రలు చనిపోతాయి యమదొంగ విషయంలో రాజమౌళి మ్యాజిక్ చేశాడని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ఆయన కెరియర్ లోనే మైల్ స్టోన్ గా మిగిలిపోయింది. ఇక మిగతా రెండు సినిమాలలో డ్యూయల్ రోల్ కావడంతో ప్రేక్షకులు అడ్జస్ట్ అయ్యారు.

నాని:
భీమిలి కబడ్డీ జట్టు, జెర్సీ, ఈగ, జెంటిల్మెన్, శ్యాం సింగరాయ్ వంటి సినిమాలలో నాని పాత్ర చనిపోతుంది. అయితే ఈ సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.


ఇక వీరితో పాటు రానా, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, మంచు మనోజ్, అల్లు అర్జున్, సాయి ధరం తేజ్, అడవి శేషు ఇలా ఈ స్టార్ హీరోలు అందరూ చనిపోయిన పాత్రలో నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: