అఖండ సినిమా భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో నందమూరి బాలకృష్ణ ఆ విజయ యాత్రను కొనసాగించుకునేందుకు పూర్తిగా రంగం సిద్ధం చేసుకున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు చేస్తున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలోని సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నాడు. దానికి తగ్గట్లుగానే ఈ సినిమాను చేస్తున్నాడు. మాస్ మసాలా సినిమాలను రూపొందించడంలో సిద్ధహస్తుడైన గోపీచంద్ మలినేని గత సినిమా క్రాక్ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

ఆ విధంగానే ఈ సినిమాను కూడా రూపొందించాలని ఆయన భావిస్తున్నాడు. నందమూరి అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు . ఈ విధంగా ఇద్దరు హిట్ ట్రాక్ లను కలిగి ఉన్న నేపథ్యంలో ఈ సినిమాలను ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తాయో చూడాలి. దానికి తోడు బాలకృష్ణ కూడా ఈ సినిమాను చేసి ప్రేక్షకులను అలరించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ ఏడాదిలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. 

ఇక ఈ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసింది ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా జరిగింది. స్క్రిప్ట్ పరంగా 100కు 100% అభిమానులను అలరించే విధంగా ఈ సినిమా ఉండబోతుంది అని దర్శకుడు చెబుతున్నారు నందమూరి అభిమానులు ఏవైతే కోరుకుంటారో అవి ప్రతి ఒక్కటి కూడా ఈ సినిమాలో ఉంటుందని ఆయన చెబుతున్నారు అక్టోబర్లో ఈ సినిమాను మొదలుపెట్టి వేసవిలో దీనిని విడుదల చేయాలని ఆయన భావిస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు నందమూరి బాలకృష్ణ కు ఎలాంటి విజయాన్ని తెచ్చిపెడతాయో చూడాలి.నటుడిగా బాలకృష్ణ కి ఎలాంటి వంక పెట్టనవసరం లేదు. గత కొన్ని రోజులుగా మాస్ సినిమాలు చేయడంలో తన ప్రత్యేకత ను చూపిస్తున్నాడు ఈ హీరో. 

మరింత సమాచారం తెలుసుకోండి: