తాజాగా సమంత - అలియా భట్ అభిమానుల మధ్య పూర్తిస్థాయిలో గొడవలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. అటు సమంతా అభిమానులు ఆలియా భట్ ను ఇటు ఆలియా భట్ అభిమానులు సమంతను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి సోషల్ మీడియాలో సమంత వర్సెస్ ఆలియా అంటూ పెద్ద వార్ జరుగుతోందని చెప్పవచ్చు. ఇకపోతే ఆలియా భట్ ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది. అయితే పెళ్లయిన రెండు నెలలకే ప్రెగ్నెన్సీ అంటూ గుడ్ న్యూస్ చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ రోజుల్లో ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు సహజమే అంటూ అభిమానులు కూడా యాక్సెప్ట్ చేశారు.

ఇకపోతే బ్రహ్మాస్త్ర  సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆలియా భట్ తన భర్త రణబీర్ కపూర్ తో కలిసి ఒక ఫోటోకి స్టిల్ ఇచ్చింది. ఆ ఫోటోలో ఆలియా చాలా బాగుందని అందరూ ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. అంతేకాదు బేబీ పంపుతో చాలా ముద్దుగా కనిపిస్తోంది అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఆమెను ఒక రేంజ్ లో పొగిడేస్తున్నారు. అయితే ఈ ఫోటోలను చూసిన అక్కినేని అభిమానులు సమంతను విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. హీరోయిన్ అంటే ఆలీయా లా ఉండాలి అని,  కోట్ల ఆస్తి,  స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అయినా కానీ పెళ్లి చేసుకుని వెంటనే పిల్లలను కనడానికి సిద్ధమయ్యింది.. ఆమెలా ఉండాలి హీరోయిన్ అంటే అంటూ అక్కినేని అభిమానులు సమంతను ట్రోల్ చేస్తున్నారు..
ఇక మరొకవైపు సమంతా అభిమానులు మండిపడుతూ .. అవునవును పెళ్లికి ముందే కాలుజారడం మా సమంతకు తెలియదు లే .. అంటూ విపరీతంగా ఆలియాను టార్గెట్ చేశారు.. ఈ గొడవల్లోకి అలియా భట్ అభిమానులు తల దూర్చి.. తప్పు చేసినా ప్రేమించిన వాడితోనే చేసింది కదా.. అంటూ సమంతను పరోక్షంగా నిందిస్తున్నారు. మొత్తానికి అయితే సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: