ఆండ్రియా జెర్మనీ.. ఈ పేరు తెలియనివారు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో లేరు అంటే అతిశయోక్తి కాదు. సింగర్ గా, నటిగా అమ్మడు వరుస అవకాశాలను అందుకొంటూ ముందుకు దూసుకెళ్తోంది
ఇక ఇటీవలే తమిళ్ పుష్ప చిత్రంలో ఊ అంటావా మావా సాంగ్ పాడి అమాంతం ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పిశాచి 2 చిత్రంలో నటిస్తోంది. 2014 లో వచ్చిన పిశాచి చిత్రంకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రంలో ఆండ్రియా కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా నటించిందని వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే.అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు మేకర్స్ కానీ, ఆండ్రియా కానీ స్పందించింది లేదు. ఇక తాజాగా ఈ వార్తలపై డైరెక్టర్ మిస్కిన్ స్పందించారు. ఈ సీన్స్ కోసం ఆండ్రియా కొన్ని కోట్లు తీసుకున్నదని కూడా ఆయన చెప్పుకొచ్చారట.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మిస్కిన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ “అవును.. ఈ చిత్రంలో ఆండ్రియా నగ్నంగా నటించింది. అయితే అవి కేవలం ఫోటోలు మాత్రమే. సీన్స్ అయితే మేము తీయలేదు. ఆ ఫోటోషూట్ కూడా ఒక లేడి ఫోటోగ్రాఫర్ తీసిందని ఆ సెట్ లోకి నేను కూడా వెళ్ళలేదు. ఈ న్యూడ్ ఫోటోషూట్ కు ఆండ్రియా ఎక్కువ మొత్తంలో పారితోషికం తీసుకొంది. అలా తీసుకోవడంలో కూడా తప్పు లేదఅనిపించింది. ఇక ఈ ఫొటోస్ ను సినిమాలో కూడా పెట్టలేదు. చిన్నపిల్లలతో కలిసి సినిమా చూసేవాళ్లకు ఇలాంటి ఫోటోలు అభ్యంతరకరంగా ఉంటాయి. అందులోనూ ఆ ఫోటోలు సినిమాలో చూపిస్తే సెన్సార్ దగ్గర ప్రాబ్లెమ్ అవుతోంది. సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇస్తారు. అందుకే వాటిని సినిమాలో చూపించడంలేదు” అని చెప్పుకొచ్చాడట.ఏదిఏమైనా నగ్నంగా నటించడానికి ఆమె ఎన్ని కోట్లు తీసుకున్నది అనేది మాత్రం దర్శకుడు రివీల్ చేయకపోవడం విశేషం. ఇక ఈ చిత్రం ఆగస్టు 31 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని అంటున్నారు .. కానీ కొన్ని కారణాల వలన సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ఈ సినిమాతో ఈ సింగర్ కమ్ నటి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరీ.