సౌత్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ లో పేరొందిన బ్రాండ్లకి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఖచ్చితంగా గుర్తొచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు.తాజాగా ఆయన మరో డీల్ ని సొంతం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ జీ ఛానల్ తో గతంలో రెండు కోట్ల డీల్ చేసుకుని ఓ భారీ ఈవెంట్ కు హాజరు కావడమే కాకుండా ఆ ఛానల్ లో ప్రసారం అయ్యే పలు క్రేజీ సీరియల్స్ కి కూడా ప్రచార కర్తగా వ్యవహరించారు. తాజాగా ఇదే ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ కు ప్రచార కర్తగా మహేష్ మరోసారి సైన్ చేయడం విశేషం. ఇందుకు గానూ మహేష్ ఏకంగా రూ. 9 కోట్లు ఛార్జ్ చేస్తున్నారట.తాజా ఒప్పందం ప్రకారం మహేష్ జీ టీవీ ఛానల్ కు సంబంధించిన రియాలీటీ షోస్ టీవీ సీరియల్స్ తో పాటు సంస్థ ప్రొడ్యూస్ చేసే పలు కార్యక్రమాలకు మహేష్ ప్రచారాన్ని కల్పించనున్నారట. ఈ డీల్ ఏడాది పాటు కొనసాగుతుందని తెలిసింది. ఇప్పటికే జీ చానల్ కోసం తన ముద్దుల కూతురు సితార తో కలిసి ఓ డ్యాన్స్ షోలో మహేష్ పాల్గొనడం విశేషం.


గత 15 ఏళ్లుగా మహేష్ కార్పొరేట్ బ్రాండ్ లకు ప్రచార కర్తగా వ్యవహరిస్తూ అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా సరికొత్త రికార్డు ని సొంతం చేసుకున్నాడు. ఇదిలా వుంటే త్రివిక్రమ్ తో మహేష్ చేయబోతున్న 28వ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 8న రామోజీ ఫిల్మ్ సిటీలో లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చక చకా జరిగిపోతున్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ని తొలి షెడ్యూల్ లో షూట్ చేయబోతున్నారు.రీసెంట్ గా మహేష్ సర్కారు వారి పాట సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా ఏకంగా 235 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి ఈ ఏడాది టాలీవుడ్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న 28 వ సినిమాపై ఎన్నో భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: