అయితే నిర్మాతలు కూడా ఈ సినిమాని హిందీలో విడుదల చేస్తే బాగుంటుంది అని అధికారికంగా ప్రకటించారు.. కానీ తెలుగులో విడుదలైన ఈ సినిమా హిందీలో విడుదల కాలేదు అందుకు కారణం డబ్ వర్షన్ లీగల్ సమస్యలు తలెత్తడమే అన్నట్టుగా సమాచారం. అయ్యప్పను కోషియమ్ చిత్రానికి రీమెక్ గా భీమ్లా నాయక్ సినిమా అని తెరకెక్కించారు అయితే ఈ సినిమా మలయాళం లో మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా తెలుగు హక్కులను సితార ఎంటర్టైన్మెంట్ వారు తీసుకున్నారు. కానీ హిందీ రైట్స్ ను మాత్రం బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం సొంతం చేసుకున్నారు
ఏకే రీమిక్స్ రైట్స్ తన వద్ద ఉన్న కారణంగా ఈ సినిమా ని హిందీలో రీమిక్స్ చేసి డబ్బింగ్ చేసి విడుదల చేయడంపై.. జాన్ అబ్రహం టీం అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా సమాచారం.. అయితే కోర్టులో ఈ సినిమాపై కేసు వేసినట్లుగా కూడా తెలుస్తోంది.. కానీ కోర్టు మాత్రం భీమ్లా నాయక్ సినిమాకె అనుకూలంగా తీర్పు వచ్చినట్లుగా వార్తలు వినిపించాయి. దీంతో ఇప్పుడు ఈ సినిమాని హిందీ భాషలో సినిమాని విడుదల చేయడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. కారణాలు ఏవైనా సరే భీమ్లా నాయక్ సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్ట లేకపోయింది. ఇక అలాంటి సినిమా బాలీవుడ్ లో ఎలా రాబడుతుంది అని అంచనా చిత్ర బృందం వేస్తున్నట్లుగా సమాచారం. ఇక అంతే కాకుండా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను బాలీవుడ్ లో విడుదల చేయగా నిరాశని మిగిల్చింది.