రామోజీ ఫిల్మ్‌ సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఫేమస్ అయ్యింది.ఇక అక్కడ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ అంటే.. మామూలుగా ఉండదు. హంగు, ఆర్భాటం, ఖర్చు చాలా ఎక్కువగానే ఉంటుంది. అనుకున్నట్లుగా 'బ్రహ్మాస్త' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను కూడా ఇలానే ప్లాన్‌ చేశారు మూవీ టీం.క్రేన్‌లు, లైట్లు ఇంకా ఫీట్లు చాలానే రెడీ చేశారు. రణ్‌బీర్‌ కపూర్‌ కోసం కాకపోయినా ఎన్టీఆర్‌ కోసమైనా సరే భారీ ఎత్తున జనాలు ఖచ్చితంగా వస్తారు. సినిమాకు పెద్ద హైప్‌ వస్తుంది అనుకున్నారు. తీరా చూస్తే మరో గంటలో ఈవెంట్ వుంది అనగా.. పోలీసులు అందుకు అనుమతి ఇవ్వలేదు, కార్యక్రమం లేదు అని షాక్ ఇచ్చారు. దీనికి కారణంగా పోలీసులు చెప్పినవాటిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ మెయిన్‌ పర్సన్‌.పోలీసులు అనుమతులు ఇవ్వం అంటూ రాసిన లేఖ ఒకటి బయటికొచ్చింది. దాని ప్రకారం చూస్తే గతంలో రామోజీ ఫిలింసిటీలో గతంలో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్లు ఇంకా ఆ తర్వాత జరిగిన పరిస్థితులే ఇప్పుడు 'బ్రహ్మాస్త్ర' పాలిట శాపంలా మారాయి అని అంటున్నారు. 2021లో ప్రభాస్‌ 'రాధే శ్యామ్' ప్రీ రిలీజ్‌ వేడుక రామోజీ ఫిలింసిటీలోనే జరిగింది.


ఆ సందర్భంలో లెక్కకు మించి పాసులు ఇచ్చారని, రాచకొండ కమిషనర్ ఆదేశాలను మీరి ఆ పని చేశారని పోలీసులు 'బ్రహ్మాస్త్ర' ఈవెంట్‌ పర్మిన్స్‌ రిజక్ట్‌ నోట్‌లో రాశారు.అంతేకాదు ఆ సందర్భంగా ఈవెంట్‌ ఆర్గనైజింగ్‌ టీమ్‌/ సినిమా టీమ్‌ మీద పెట్టిన కేసుల వివరాలు కూడా పొందుపరిచారు. దాంతోపాటు 'సాహో' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ గురించి కూడా ఇందులో రాసుకొచ్చారు. ఆ ఈవెంట్‌కి తండోప తండాలుగా వచ్చిన అభిమానులను కంట్రోల్ చేయలేక పోలీసులు ఇబ్బంది పడ్డారని కూడా తెలిపారు. ఈవెంట్‌ ఆర్గనైజర్ల వైఫల్యాన్ని ఈ రెండు ఘటనలు ఎత్తి చూపుతున్నాయని పోలీసులు ఆ లేఖలో పేర్కొన్నారు.ఇక 'బ్రహ్మాస్త్ర' ఈవెంట్ కోసం 10 నుంచి 12 వేల దాకా జనం వస్తారని పేర్కొన్నారని, కానీ ఈవెంట్‌ పాసులు జారీ చేసే పద్దతి గురించి తమకు తెలపలేదని పోలీసులు అన్నారు. అంతేకాకుండా 'రాధేశ్యామ్‌' ఈవెంట్‌ అప్పుడు. ఫిలిం సిటీ ముందు ఉన్న నేషనల్ హైవే 65 మీద భారీగా వాహనాలు పార్క్ చేయడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని పోలీసులు చెప్పారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో 'బ్రహ్మాస్త్ర' ఈవెంట్‌కు పర్మిషన్లు ఇవ్వలేం అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: