ఒక మిస్టరీ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే ఇందులో కథను మాత్రం డైరెక్టర్ సుకుమార్ అందించడం మరొక ఆసక్తికరమైన విషయంగా మారుతోంది. ఇక ఈ ప్రాజెక్టు ఎంతవరకు వచ్చిందనే విషయాన్నికి వెళ్తే.. సెప్టెంబర్ ఐదున కేరళలో షూటింగ్ ప్రారంభించారని చిత్రగుండం ప్లాన్ చేసింది నవంబర్ చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం సినిమాలో నటించిన హీరోయిన్ సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నది ఇక ఈ సినిమాకి డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుకుమార్ రైటింగ్స్ అందిస్తున్నారు ఈ సినిమాలో బ్రహ్మాజీ, సునీల్ తదితరులు ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా లైన్ గురించి ఆమధ్య ఒకటాక్ వినిపించింది. ఈ సినిమా మొత్తం మంత్రాలు చుట్టూ తిరుగుతుందని అంతేకాకుండా వరుసగా జరుగుతున్న మర్డర్ మిస్టరీల గురించి హీరో ఏ విధంగా చేదిస్తాడో అని కథాంశంతో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక డైరెక్టర్ సుకుమార్ ఇలాంటి కథ అందించడంతో ఈ సినిమా మరింత హైలెట్గా కావడం గమనార్హం. మరి ఈ సినిమాతో నైనా సాయి ధరంతేజ్ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.