పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మారిపోయారు. ఇక ఈ సినిమాకి కొనసాగింపుగా పార్ట్-2 అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. అందుకోసం ముందుగానే సుకుమార్ ఒక ప్రత్యేకమైన స్క్రిప్టును కూడా సిద్ధం చేశారు. ఆ తర్వాత సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యారు సుకుమార్ అయితే సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ పనులు ఇటీవల పూర్తి కావడంతో ఈ సినిమాకు సంబంధించి పూజ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇక గత కొద్ది రోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్ను కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ విషయంలో పలు మార్పులు చేయడానికి సిద్ధమైనట్లుగా సమాచారం.



మొదటి పార్ట్ లో గుబురు గడ్డంతో అల్లు అర్జున్ ఏ విధంగా కనిపించాడు మనం చూసే ఉన్నాము. ఈసారి మాత్రం అందులో  పలుమార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి మరింత ఎక్కువ గడ్డం కాకుండా కొంత మీసాలు తగ్గించి మాస్ లుక్ లో చాలా స్టైలిష్ లుక్ లో ట్రై చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక సెకండ్ పార్ట్ లో కూడా కాస్త డిఫరెంట్ మేనరిజం చూపించబోతున్నట్లు సమాచారం. డైరెక్టర్ సుకుమార్ ఇచ్చిన సలహాలకు అల్లు అర్జున్ తనదైన శైలిలో బాడీ లాంగ్వాజ్ కూడా మార్చుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక పూర్తిస్థాయిలో న్యూ లుక్ పైన సుకుమార్ చాలా సంతృప్తి చెందినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలై ఒక డిఫరెంట్ లుక్కుని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం. ఏది ఏమైనా పుష్ప సినిమా మొదటి భాగాని కంటే సెకండ్ పార్ట్ లో అల్లు అర్జున్ పాత్ర కాస్త ఎక్కువగా ఉండాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక మైత్రి మూవీస్ వారు కూడా ఖర్చుకు వెనకాడకుండా పూర్తి స్వేచ్ఛ చేసినట్లుగా సమాచారం. మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: