
దీనికి సంబంధించిన స్టోరీ లైన్ పూరీ ఆలోచించడం దానికి హీరో రామ్ ఓకె చెప్పినట్లు కూడ అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే విజయ్ దేవరకొండ పూరీ వైపు యూటర్న్ తీసుకోవడంతో ఈ సీక్వెల్ ఆలోచనలు పక్కకుపెట్టి బ్లాక్ బష్టర్ హిట్ కోసం ‘లైగర్’ వైపు వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు పూరీ కలలు అన్నీ చెదిరిపోవడంతో తిరిగి ‘ఇస్మార్ట్ శంకర్ 2’ వైపు మళ్ళినట్లు లీకులు వస్తున్నాయి.
‘లైగర్’ మూవీని తీస్తుండగానే పూరీ ‘జన గణ మన’ మొదలుపెట్టాడు. ఈమూవీని మైహోమ్ సంస్థ నిర్మించడానికి ఒప్పందం చేసుకుని ‘జన గణ మన’ పై ఇప్పటికే 20 కోట్లు ఖర్చు పెట్టారు అని అంటారు. అయితే ఇప్పుడు ఈమూవీ చేసే విషయంలో విజయ్ దేవరకొండకు మరొక ఆలోచన రావడంతో పూరీ మైహోమ్ వారితో ఖర్చు పెట్టించిన 20 కోట్ల మొత్తానికి నష్టపరిహారంగా మరొక కొత్తమూవీ తీసి ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడటంతో ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్ 2’ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చింది అని అంటున్నారు.
అయితే ఇప్పుడు ఈ సీక్వెల్ కథ నమ్మి పూరీతో సినిమా చేయడానికి ఏ హీరో ముందుకు వస్తాడు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న. ప్రస్తుతం హీరో రామ్ మార్కెట్ కూడ అంతంత మాత్రంగానే ఉంది. దీనితో తిరిగి వీరిద్దరూ టీమ్ అవ్వడానికి అంగీకరించినా ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ కు క్రేజ్ ఏర్పడుతుందా లేదా అన్నది సస్పెన్స్. అయితే ఈవిషయమై పూరీ సన్నిహితులు వేరేవిధంగా స్పందిస్తూ ‘జన గణ మన’ ఆగదు అది తీయడం ఖాయం అంటున్నారు..