ఒక హీరో కెరియర్ లో విజయాలు అపజయాలు రావడం అనేది ఎంతో సహజం. అయితే విజయాలు వచ్చినప్పుడు విర్రవీగి పోవడం అపజయాలు వచ్చినప్పుడు నిరాశ పరిపోవడం వంటిది చేయకూడదు. ఎందుకంటే హీరో అంటే ఎంతో మంది ప్రేక్షకుల ఆరాధ్య దైవం. వారిని తమ అభిమానులు చాలామంది ప్రేమిస్తూ ఉంటారు. అలాంటి వారు ఉన్నప్పుడు ఏమాత్రం తప్పుగా ప్రవర్తించిన కూడా వారి పట్ల ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి.

అలా హిట్ లాంజ్ ఫ్లాపులను ఒకే లాగా చూస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వెళ్లే హీరోలకు ఎప్పుడు కూడా మంచి గుర్తింపు ఉంటుంది మన ప్రేక్షకులలో. ఆ విధంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గెలుపోటములకు అతీతంగా ప్రేక్షకులను వారి అభిమానాన్ని సంపాదించుకుంటున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏమాత్రం వారిని అలరించకపోయిన కూడా ఆయన క్రేజ్ కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ప్రస్తుతం ఆయన పెద్ద దర్శకులతో సినిమాలో చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. 

ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఇప్పటినుంచి మంచి సినిమాలను ఎంపిక చేసుకుని ముందుకు పోవాలని చాలామంది ఆయన శ్రేయోభిలాషులు సలహాలు ఇస్తున్నారట. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే ఒప్పుకున్న జనగణమన సినిమాను రద్దు చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తొందర్లోనే రానుంది. పూరి జగన్నాథ్ తో కలిసి చేసిన మొదటి సినిమా భారీ ఫ్లాప్ అయిన కారణంగానే ఈ సినిమా పోస్ట్ పోన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే సినిమాలతో విజయ్ దేవరకొండ ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తాడు చూడాలి ఆయనకు క్రేజ్ మాత్రం దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఉంది. లైగర్ సినిమా ప్రమోషన్స్ లో ఈ హీరో చేసిన ప్రమోషన్ కార్యక్రమాలకి జనాలు ఏ రేంజ్ లో వచ్చారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: