కేఎల్ రాహుల్, అథియా శెట్టి పెళ్లి ఫిక్స్.. ఎక్కడంటే?

టీం ఇండియా స్టార్ ప్లేయర్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇంకా బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కుమార్తె బాలీవుడ్ హీరోయిన్ అథియా శెట్టితో చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. మీడియాలో వస్తున్న తాజా కథనాల ప్రకారం వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం తెలుస్తుంది.డిసెంబరు నెల చివరి వారంలోగానీ జనవరి మొదటి వారంలోగానీ వీరిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.వీరిద్దరు తమ వివాహ వేదికగా నటుడు సునీల్ శెట్టి బంగ్లా 'జహాన్'ని ఎంచుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ బంగ్లా ఖండాలాలో ఉంది. ఈ వివాహానికి క్రీడా వినోద రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే పెళ్లి వ్యక్తిగత వ్యవహారం గా భావిస్తూ ఎక్కువమందిని పిలవడం లేదని.. కేవలం సన్నిహితులనే పిలుస్తున్నారని సమాచారం తెలుస్తుంది.అతియా,కేఎల్ రాహుల్ ఇద్దరూ వివాహ వేడుకను ఘనంగా నిర్వహించడానికి ఆసక్తి చూపడం లేదని తెలిసింది. వారు కొంతమంది స్నేహితులు సన్నిహిత కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించాలనుకుంటున్నారు.


ప్రస్తుతానికి ఈ జంట ముంబైలోని సముద్రతీరానికి ఆనుకొని ఎదురుగా ఉన్న ఫ్లాట్లో కలిసి జీవిస్తున్నట్లు సమాచారం. త్వరలో వీరి పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.సునీల్ శెట్టి హీరోగా బాలీవుడ్ లో వెలుగు వెలిగిన సమయంలో ఈ చారిత్రక బంగ్లాను 17 సంవత్సరాల క్రితం నిర్మించాడు. చుట్టూ గ్రీనరీతోపాటు విశాలమైన ప్రదేశంలో ఈ బంగ్లా విస్తరించి ఉంది.కాగా కేఎల్ రాహుల్ అతియా మూడేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. అతియా 2015లో సూరజ్ పంచోలీ సరసన 'హీరో' చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ముబాకరన్ మోతీచుర్ చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు.ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ తో పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ మూడేళ్లుగా డేటింగ్ లో కలిసే ఉంటున్నారు. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: