టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ఇక ప్రస్తుతం ఈమె వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది అన్న సంగతి అందరికి తెలిసిందే. అంతేకాదు ఈమె ప్రస్తుతం  టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటోంది.ఇకపోతే ఇప్పటికే సమంత హిందీలో పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వాటితో పాటుగా ఒక హిందీ వెబ్ సిరీస్ కు కూడా సిగ్నల్ ఇచ్చిందట.ఇక  ఆ వెబ్ సిరీస్ హీరోయిన్ తాప్సీ పన్ను నిర్మాణ సంస్థలో ఉండబోతోంది అని తెలుస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ సమంతకు బాలీవుడ్ డెబ్యూ అవ్వనుంది అని తెలుస్తోంది.

కాగా  ఈ వెబ్ సిరీస్ ఇంకా పట్టాలెక్కకముందే సమంత మరొక బాలీవుడ్ ప్రాజెక్టుకి ఓకే చేసినట్టుగా వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.ఇకపోతే బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కనున్న ఆ సినిమాలో సమంత ని హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక  ఈ సినిమాకు సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు కానీ అందులో ఆమె పాత గురించి ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. కాగా ఆ సినిమాలో సమంత న ద్విపాత్ర అభినయంలో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ రెండు పాత్రలు కూడా ప్రత్యేకంగా నిలుస్తూ సమంతకు మంచి గుర్తింపు తెచ్చి పెడతాయని తెలుస్తోంది.

ఇక  ఇప్పుడు సమంత డ్యూయల్ రోల్ లో హిందీ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అయితే  ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు చూడాల్సిందే మరి. ఇక సమంత ప్రస్తుతం తెలుగులో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి అనే సినిమా టైటిల్ తో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలయ్యింది.అంతేకాదు ఈ సినిమాలతో తో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తుంది సమంత..!!

మరింత సమాచారం తెలుసుకోండి: