యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తమిళ్ మూవీ విక్రమ్ ని తెలుగులో నితిన్ హోమ్ బ్యానర్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందడంతో తెలుగులో కూడా కాస్త ఎక్కువ మొత్తానికి నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కొనుగోలు చేయడం జరిగిందట..


విక్రమ్ సినిమాని అంత భారీ మొత్తానికి సుధాకర్ రెడ్డి కొనుగోలు చేయడంతో అంతా కూడా నూరేళ్ల పెట్టారు. కమల్ హాసన్ గత 10 ఏళ్లుగా కనీసం ఒక్క సక్సెస్ ని కూడా దక్కించుకోలేక పోయాడు. అయినా కూడా ఆయన సినిమాకు అంత భారీగా పెట్టడమేంటి అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపుగా 10 కోట్ల రూపాయల లాభం సుధాకర్ రెడ్డికి దక్కింది అనేది ఇండస్ట్రీ వర్గాల వారి మాట.


లాభం ఎంత అనేది అధికారికంగా క్లారిటీ లేదు కానీ భారీ లాభం దక్కింది అనేది మాత్రం సుధాకర్ రెడ్డి సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం. ఇదే సమయంలో ఆయన తమిళ్ లో రూపొందిన కెప్టెన్ అనే సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యాడట.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు ఆయిన హీరో ఆర్య నటించిన కెప్టెన్ సినిమా ఒక హాలీవుడ్ రేంజ్ లో ఉంది అంటూ ఇప్పటికే ఆసక్తికర చర్చ జరుగుతుంది. ట్రైలర్ ఒక హాలీవుడ్ సినిమాని చూసినట్లుగా ఉందంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ సినిమాతో కూడా సుధాకర్ రెడ్డి మంచి లాభాలను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం విక్రమ్ సినిమాతో దక్కిన లాభం కెప్టెన్ తో పోతుందేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట.. ఎందుకంటే ఆర్య తమిళ్ సినిమాలకు ఇక్కడ అంతగా మార్కెట్ లేదు.. కనుక పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: