ఈ క్రమంలోనే ఎలాగైనా మరో సినిమాతో హిట్ అందుకునీ ఫామ్లోకి రావాలని అనుకుంటున్నాడు రౌడీ హీరో. శివ నిర్వనా దర్శకత్వంలో సమంత తో కలిసి ఖుషి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు సుకుమార్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాకు ఒప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే. పుష్ప 2 తర్వాత సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఇలాంటి సమయంలోనే మరిన్ని ప్రాజెక్టులకు కూడా రౌడీ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట విజయ్. సాధారణంగా ఒక సినిమా డిజాస్టర్ అయ్యిందంటే ఆ హీరోకి అవకాశాలు ఇవ్వడానికి దర్శకులు భయపడతారు.
కానీ లైగర్ సినిమా డిజాస్టర్ తర్వాత కూడా విజయ్ దేవరకొండ ఒక బంపర్ ఆఫర్ కొట్టేసాడు అన్నది తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీసి ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసిన హరీష్ శంకర్ తో విజయ్ దేవరకొండ సినిమా చేయబోతున్నాడట. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. అయితే గీత గోవిందం తర్వాత హరీష్ శంకర్ విజయ్ తో సినిమాకు ప్రయత్నాలు చేసినప్పటికీ విజయ్ బిజీగా ఉండడంతో చివరికి వీరి కాంబినేషన్ సెట్ కాలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తున్న హరీష్ శంకర్ ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా కాస్త లేట్ అయ్యే అవకాశముందని భావించి.. విజయ్ తో సినిమాను ముందుగా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడట. దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సివుంది.