కోలీవుడ్లో స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. డబ్బింగ్ సినిమాలతో ఇటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను నటిస్తే చాలా బిజీగా ఉన్నారు. తాజాగా తనకేరియర్ల 42వ సినిమాను ప్రారంభించారు సూర్య. ఇక ఈ సినిమాని డైరెక్టర్ సిరుతై శివ దర్శకత్వం వహించారు. విచిత్రాన్ని టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యువి క్రియేషన్ మరియు గ్రీన్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా చెన్నైలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా చాలా గ్రాండ్గా విడుదలయ్యాయి.


ఈ రోజున చిత్రబృందం సూర్య అభిమానుల కోసం ఒక సర్ప్రైజ్ ను ఇవ్వడం జరిగింది. తన 42వ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇక ఆ వీడియో విషయానికి వస్తే ఒక యుద్ధ భూమిలో మంటలు చెలరేగుతూ ఉండగా ఆకాశంలో ఒక గద్ద తిరుగుతూ ఉన్నట్లుగా చూపిస్తారు. ఇక చివరిగా సూర్య భుజం మీద ఆ గ్రద్ద వచ్చి వాలడంతో సూర్యకు సంబంధించి సైడ్ లుక్కుని రివీల్ చేయడం జరిగింది. ఇందులో సూర్య చేతిలో ఆయుధాలు పట్టుకొని నిలబడినట్లుగా ప్రజెంటేషన్ చేయడం జరిగింది.


ఇప్పటివరకు ఇలాంటి సినిమాలలో సూర్య నటించలేదని ఆయన అభిమానులు సైతం భావిస్తున్నారు. ఈ చిత్రం కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇంక అంతే కాకుండా చారిత్రాత్మక నేపథ్యంలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ విజువల్ గా తెరకెక్కిస్తున్నట్లుగా ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని త్రీడీలో కూడా రూపొందిస్తున్నామని పది భాషలలో కూడా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా సూర్య కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమాగా నిలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా దిశా పటానీ నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: