టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారం చాలా కామన్...మనం ప్రతి రోజు ఏదో ఒక ప్రేమ వ్యవహారం గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే హీరో హీరోయిన్ లేదా హీరోయిన్ దర్శకుడు లేదా హీరోయిన్ నిర్మాత ఇలా ఎన్నో రకాల ప్రేమ కథలను వింటూ ఉంటాం.ఇకపోతే తాజాగా మరో ప్రేమ కథ గురించి తమిళ్ మరియు తెలుగు మీడియాలో ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి.అయితే  తెలుగు మరియు తమిళంలో హీరోగా సిద్ధార్థ మంచి గుర్తింపును దక్కించుకున్నాడు.ఇక  దాదాపు దశాబ్ద కాలం పాటు ఆయన హీరోగా అక్కడ ఎక్కడ మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు.

అయితే ప్రస్తుతం ఆయన సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఈ సమయంలోనే ఆయన ప్రేమలో ఉన్నట్లుగా పుకార్ల షికార్లు చేస్తున్నాయి. అయితే ఆ మధ్య టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం సాగించినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఆమెతో బ్రేకప్ అయ్యాడు.ఇదిలావుంటే ఇప్పుడు అదితి రావు హైదరి తో ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే కొన్నాళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అంటూ ప్రచారం జరిగింది.ఇక  ఇద్దరు కలిసి మహాసముద్రం అనే సినిమాను చేశారు.అయితే ఈ  సమయంలోనే ఇద్దరికి సంబంధించిన వార్తలు తెగ ప్రచారం జరిగాయి. 

ఆ సమయంలో వారిద్దరూ వార్తల గురించి స్పందించ లేదు. ఇక దాంతో కొన్నాళ్ల తర్వాత ఆ విషయమై అంతా మర్చి పోయారు.అయితే మళ్ళీ ఇన్నాళ్లకు పొన్నియిన్ సెల్వన్‌ సినిమా యొక్క భారీ ఈవెంట్లో వీరిద్దరు కలిసి పాల్గొన్నారు. కాగా ఇద్దరు కలిసి రావడంతో పాటు ఇద్దరు కలిసి ఒకే కారులో వెళ్లి పోయారు.ఇక  దాంతో ఇద్దరు సహజీవనం చేస్తున్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారైనా ఈ విషయమై క్లారిటీ వస్తుందేమో చూడాలి.ఇక ప్రస్తుతం సిద్ధార్థ్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: