తెలుగు స్టార్ హీరోయిన్ సమంత గురించి అన్ని విషయాలు మనకు తెలిసినవే. కానీ తన కెరీర్ గురించి చెప్పుకోవడానికి మాత్రం చాలా ఉంది. తన కెరీర్ పరంగా సాలిడ్ హిట్ 2020 లో ఓ బేబీ తర్వాత ఇంకా తన నుండి మంచి సినిమా రాలేదు. అయితే సమంత తెలుగులో ఇంత గ్యాప్ తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. కరోనా రావడం ఒక కారణం అయితే, తాను వైవాహిక జీవితంలో సమస్యలు మరొక కారణం. తాను నాగచైతన్యతో విడిపోయింది.. దీని నుండి బయట పడడానికి చాలా సమయం పట్టింది. మళ్ళీ ఇపుడిపుడే తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం సమంత వరుసగా రెండు సినిమాలను లైన్ లో పెట్టింది.

అందులో ఒక సినిమా యశోద... ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం ఈ రోజు విడుదల చేసింది. ఈ సినిమా టీజర్ ను చూస్తే గర్భవతిగా ఉన్న సమంత జీవితంలో చోటు చేసుకున్న పరిస్థితులు ఏమిటి ? ఆ పరిస్థితులను ఎదుర్కొని తాను తన బిడ్డకు జన్మనిచ్చిందా అన్నది కథగా తెలుస్తోంది. ఈ కథలో అసలు విషయం తెలియయకుండా దాచేసినా ప్రేక్షకులు మాత్రం ఈజీగానే ఊహించే కథలాగానే ఉంది. కాగా ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తమిళ డైరెక్టర్లు హరి మరియు హరీష్ లు... మొత్తానికి టీజర్ ను ఆసక్తికరంగా కట్ చేసి ఆకట్టుకున్నారు అని చెప్పాలి.

ఇక టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్దిరిపోయింది. ఇది పాన్ ఇండియా మూవీ గా రానుంది.  కాగా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, మురళి శర్మ లు కూడా నటిస్తుండడం విశేషం. ఇది కాకుండా సమంత గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం మూవీ లో నటిస్తోంది. ఈ సినిమా కనుక హిట్ అయితే లేడీ ఓరియెంటెడ్ మూవీ తో సమంత పాన్ ఇండియా లేడీ సూపర్ స్టార్ అవుతుందా చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: