ఈ టీజర్ మొత్తం ఏఆర్ రెహమాన్ పాడిన పాట నేపథ్యంలో చూపించడం జరిగింది ఇది ఒక వలస కార్మికుడు కష్టాలు నేపథ్యంలో రూపొందించిన యాక్షన్ డ్రామా చిత్రంగా కనిపిస్తోంది. ఇక ఒక పల్లెటూరు యువకుడిగా కనిపించిన శింబు.. తన కుటుంబాన్ని పోషించడం కోసం కూలి పనులకు వెళతారు. అతనికి తల్లి గా రాధిక నటించింది. ఇక ముత్తు కి తన సోదరీ అంటే చాలా ప్రేమ ఉన్నట్లుగా ఈ టీజర్ లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో మలయాల నటుడు నీరాజు మాధవ్ సిద్ధిక్ ఇతర నటీనటులు సైతం కీలకపాత్రను నటిస్తున్నారు.
బతుకుతెరువు కోసం సిటీకి వచ్చిన ముత్తు లైఫ్ టర్న్ అవుతుందా లేదా ఉద్యోగం దొరుకుతుందా లేదా.. తనకు పని దొరికిన చోటే శ్రామిక శక్తిని దోపిడీ చేసే వారి మధ్య ముత్తు ఎలా ఉంటారో అన్నది ఈ సినిమా కాన్సెప్ట్ అన్నట్లుగా ఈ టీజర్ ను చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ టీజర్ కాస్త వైరల్ గా మారు తోంది.