నాగ శౌర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కృష్ణ వ్రింద విహారి. ఈ చిత్రాన్ని అనిష్ .ఆర్. కృష్ణ దర్శకత్వం వహించారు. గత కొన్ని రోజులకు వరుసగా ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది ఈ చిత్రం ఎట్టకేలకు సెప్టెంబర్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్స్ ఈ సినిమా పైన మరింత అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీ గా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా షిర్లీ సేటియా నటిస్తున్నది.


ఇక తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. ఇక గతంలో విడుదలైన పలు వీడియోలలో కూడా నాగశౌర్య, షిర్లీ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగా వర్క్ అవుట్ అయ్యాయని మేకింగ్ వీడియోతో స్పష్టం చేశారు చిత్రాలు బృందం. ఇక ట్రైలర్ విషయానికి వస్తే సత్య నా డాక్టర్ కోమా నుంచి బయటికి రావడం నాకు ఎంతో ఇంపార్టెంట్ అంటూ నాగశౌర్య వాయిస్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది.. ఇక నాగశౌర్య ఈ సినిమాలో విభిన్నమైన గెటప్ లో కనిపించబోతున్నారు సిటీకి వచ్చిన ఒక అమాయకపు మనుషుల కనిపిస్తున్నారు.


అలా ఎంతో చదివి ఉద్యోగం సంపాదించి అక్కడే హీరోయిన్ తో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమ పెళ్లి వరకు దారితీస్తుందా లేదా అనేకదా అంశంతో ఈ సినిమాని ఎక్కించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగశౌర్య బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి లా కనిపిస్తున్నారు. ఇక నాగశౌర్యకు తల్లిపాత్రలో రాధిక శరత్ కుమార్ నటించారు. ఇక ఇందులో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు కీలకమైన పాత్రలు నటించారు. ఇక నాగశౌర్య చెబుతున్న డైలాగులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. మరి ఈ చిత్రంతో నాగశౌర్య విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: