టాలీవుడ్ ఇండస్ట్రీలో 2011లో `బెజవాడ` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది అమలాపాల్‌. అనంతరం ఈమె `లవ్‌ ఫెయిల్యూర్‌`, `నాయక్‌, `ఇద్దరమ్మాయిలతో`, `జెండా పైకపిరాజు` చిత్రాల్లో మెరిసింది. కేవలం `నాయక్‌` ఒక్కటే ఆమెకి తెలుగులో సక్సెస్‌ని ఇచ్చింది.కాగా మిగిలిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. ఇక దీంతో అమలా పాల్‌ తెలుగుకి దూరమయ్యింది. అయితే చాలా రోజుల తర్వాత ఇటీవల ఓటీటీ ఫిల్మ్ `పిట్టకథలు` చేసి ఆకట్టుకుంది.ఇదిలావుంటే ఇక తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కారణమేంటనేది తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది అమలాపాల్‌. అయితే ఈ సందర్భంగా టాలీవుడ్‌ పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇక  తాను తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పుడు ఇండస్ట్రీ కొన్ని ఫ్యామిలీల చేతుల్లోనే ఉందని అర్థమైందని, ఆ ఫ్యామిలీలు మాత్రమే టాలీవుడ్‌ని శాషిస్తుంటాయని, ఆధిపత్యం చెలాయిస్తుంటాయని చెప్పి షాకిచ్చింది.అంతెందుకు ఆ టైమ్‌లో వారు తీసే సినిమాలు డిఫరెంట్‌గా ఉండేవని, ప్రతి సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్లు ఉండేవారని, హీరోయిన్స్ ని కేవలం గ్లామర్‌గానే చూపించేవారని తెలిపింది.అయితే  కొన్ని లవ్‌ సీన్లు, సాంగ్స్ లోనే హీరోయిన్లు కనిపించే వారని, మిగిలినదంతా హీరోనే ఉండేవారని, పూర్తి కమర్షియల్‌ సినిమాలు తీసేవారని పేర్కొంది. ఇక దీంతో తెలుగు ఇండస్ట్రీకి తాను దగ్గర కాలేకపోయానని, తక్కువ సినిమాలు చేశానని తెలిపింది అమలాపాల్‌.

అయితే కోలీవుడ్‌లో సినిమాలు చేయడంపై ప్రశంసలు కురిపించింది. ఇక తమిళంలో చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొంది. అమలాపాల్‌ మాట్లాడుతూ, కోలీవుడ్‌లో ఫిల్మ్ మేకర్స్ కొత్త హీరోయిన్ల కోసం వెతుకున్న సమయంలో నేను తమిళంలోకి ఎంట్రీ ఇచ్చాను.అయితే  అక్కడ కూడా ఆడిషన్స్, మీటింగ్స్‌ అంటూ ఏడాది పాటు ఇబ్బంది పడ్డానని, అక్కడ ప్రారంభంలో చేసిన రెండు సినిమాలు ఇప్పటికీ విడుదలకాలేదని తెలిపింది.కాగా మూడో సినిమా `మైనా` సంచలన విజయం సాధించి తనకు మంచి గుర్తింపుని తీసుకురావడంతోపాటు ఓవర్‌నైట్‌లో స్టార్‌ని చేసిందని చెప్పింది.అయితే  `మైనా` తర్వాత వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయని, పెద్ద స్టార్స్ తోనూ కలిసి నటించే అవకాశాలు వచ్చాయని పేర్కొంది అమలాపాల్‌.కాగా డస్కీ బ్యూటీ అమలాపాల్‌ ఇటీవల `కడెవర్‌` చిత్రంతో అలరించింది.ఓటీటీలో విడుదలైంది.అయితే  ప్రస్తుతం మలయాళంలో `టీచర్‌`, `క్రిస్టోఫర్‌`, `ఆడుజీవితం`(డిలే) చిత్రాల్లో నటిస్తుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: