కేంద్ర మాజీ మంత్రిగా రెబల్ స్టార్ కృష్ణంరాజు ఎంతో పేరు సంపాదించారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న కృష్ణంరాజు నిన్నటి రోజున హైదరాబాదులో AIG ప్రైవేట్ హాస్పిటల్ లో మరణించారు. ఇక ఈ విషయంపై సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు సైతం ఆయనకు ఘన నివాళులు అర్పించారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన ఆకస్మిక మృతి పై తీవ్ర దిగ్భ్రాంతికి గురి అవ్వడం జరిగింది. ఇక కృష్ణంరాజు అంత్యక్రియలు హైదరాబాదులో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలుస్తోంది.


అయితే మొదట జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంతక్రియలు నిర్వహించాలని అనుకోగా ఆ తరువాత అంత్యక్రియలను మొయినాబాద్ తన ఫామ్ హౌస్ లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది కాగా కృష్ణంరాజు తలకొరివిని ప్రభాస్ పెడతాడని అందరూ అనుకుంటున్నారు.  కానీ ప్రభాస్ కి బదులుగా అతని సోదరుడు ప్రబోధ్ కృష్ణంరాజుకి తలకొరివి పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే సెప్టెంబర్ 12న ఉదయం అంత్యక్రియలు జరపాలని మొదట పండితులు సూచించారట. అయితే పండితుల సూచనల మేరకు ఈ అంత్యక్రియలు సాయంత్రానికి మార్చినట్టుగా సమాచారం. దీంతో అభిమానులు కృష్ణంరాజు చివరి చూపు కోసం భారీ ఎత్తున తరలివస్తున్నట్లుగా సమాచారం.

సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కనక మామిడి ఫామ్ హౌస్ లో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. అయితే ఈ ఫామ్ హౌస్ కృష్ణంరాజుకు చాలా ఇష్టంతో ఐదు సంవత్సరాల క్రితం కొన్నాడట. అందుచేతనే కృష్ణంరాజు అంతక్రియలు కూడా అక్కడే చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కృష్ణంరాజు అంత్యక్రియలకు హాజరు కావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కూడా చాలామంది ప్రముఖులు సైతం హాజరయ్యారు. అయితే కృష్ణంరాజు తలకొరివి ప్రభాస్ పెట్టడు అనే వార్త వినగానే అభిమానులు అందరూ ఆశ్చర్యపోయారు. ఇక దీంతో ప్రభాస్ తమ్ముడు బయటకు వస్తున్నాడని  సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: