తెలుగు ఇండస్ట్రీలో హీరో శర్వానంద్ కు సరైన సక్సెస్ రాక చాలా కాలం అవుతోంది. తాను నటించిన తాజా చిత్రం ఒకే ఒక జీవితం. ఈ చిత్రంలో అక్కినేని అమల ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా రీతు వర్మ నటించినది. తల్లి కొడుకుల మధ్య ప్రేమ అనుబంధాలు టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా కథను డైరెక్టర్ శ్రీ కార్తీక్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని చెప్పవచ్చు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలకు ముందు వరుస ప్లాపులతో సతమతమవుతున్న శర్మానందుకు ఈ చిత్రం కాస్త బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు.


టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తల్లి కొడుకుల మధ్య సెంటిమెంట్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. దీంతో ఈ సినిమాపై  ప్రేక్షకులు సైతం ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఇక వీటితోపాటు వెన్నెల కిషోర్, ప్రియదర్శనిల కామెడీ చాలా అద్భుతంగా ఉందని కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ చిత్రంపై తాజాగా హీరోయిన్ అతిధిరావు హైదరి స్పందించడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


అతిథి రావు హైదరి ఇలా స్పందిస్తూ.. నాకు కన్నీళ్లు తెప్పించి నా హృదయాన్ని నవ్వించినందుకు ధన్యవాదాలు.. ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ఒక వ్యక్తి గురించి చెప్పి ఇలా సినిమా తీసినందుకు థాంక్యూ.. అమ్మలు నిజంగా ప్రపంచాన్ని ఉత్తమ ప్రదేశంగా మారుస్తూ ఉంటారని. ఈ సినిమా మీ అమ్మలను తీసుకువెళ్లి ప్రతి ఒక్కరు చూడండి అంటూ ట్విట్టర్లో తెలియజేయడం జరిగింది. ఇక అతిథి రావు శర్వానంద్ కలిసి మహాసముద్రం సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే గత కొన్ని రోజులుగా హీరో సిద్ధార్థ అతిధిరావు హైదరి ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: