కృష్ణంరాజు గారిని చాలా మిస్ అవుతున్నాను. ఆయన సెట్లో ప్రతి ఒక్కరిని తన పిల్లల్లాగే చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. మా అందరి పైన తన సొంత బిడ్డల లాగా కేర్ తీసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది.. ఒక తల్లి పిల్లలకు ఎలా అయితే ఆలనా పాలనా చూస్తుందో ఆయన కూడా సెట్లో ప్రతి ఒక్కరు తిన్నారా లేదా అనే విషయాన్ని చూస్తూ ఉంటారు. తినని వారికి తల్లిలాగే కొసరి కొసరి తినిపిస్తారు అంటూ తెలిపారు రాఘవ లారెన్స్. ప్రస్తుతం తాను ఆ ప్రేమను, ఆ కేర్ ని మిస్ అవుతున్నాను అని ప్రస్తుతం అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల తన దురదృష్టం అని అందుకే ఆయనను కడసారిగా చూసుకోలేకపోయాను అని కూడా ఎమోషనల్ అవుతూ తెలిపారు.
అంతేకాదు ఆయన లెగసీ ప్రభాస్ గారి ద్వారా కొనసాగుతుందని తాను ఆశిస్తున్నాను అంటూ రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చిన వ్యాఖ్యలు కాస్త బాగా వైరల్ అవుతున్నాయి. ఇక కృష్ణంరాజు మరణం తర్వాత ప్రభాస్ ఒంటరివాడయ్యాడు. అటు కుటుంబ బాధ్యతలను ఇటు సినిమాలను రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. మరి ప్రభాస్ ఇంకా పెళ్లి కానీ ముగ్గురు అమ్మాయిలకు పెళ్లి చేసి , ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఆయన బాధలు కూడా ప్రభాష్ తీసుకోబోతున్నట్లు సమాచారం.