హిట్ , ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఎప్పటి కప్పుడు పైవిద్యమైన మూవీ లలో నటిస్తూ తన నటన తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నీది నాది ఒకే కథ , మెంటల్ మదిలో , బ్రోచే వారెవరురా , రాజ రాజ చోర వంటి వైవిధ్యమైన మూవీ లతో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీ విష్ణు కొంత కాలం క్రితమే భళా తందానాన మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయ్యింది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ విష్ణు అల్లూరి అనే మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ లో శ్రీ విష్ణు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ మూవీ కి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని తాజాగా ప్రకటించింది. ఈ సినిమా ట్రైలర్ ని సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే శ్రీ విష్ణు 'అల్లూరి' మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: