ఇక ఈ చిత్రం తర్వాత దీతున్ నన్నుమ్, విట్ల విసేనవం వంటి సినిమాలుగా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈమె తమిళంలోని ఆరు, నీతం ఓరు వాసం సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం ఆమె నిత్యం అరుదానం అనే చిత్రంలో కూడా నటిస్తూ ఉన్నది. ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా తనకు సంబంధించి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు చిత్ర బృందం. ఇందులో ఆమె చాలా లావుగా ఉన్నట్లు కనిపించడం జరిగింది. దీంతో ఆమెపై ట్రోలింగ్ కూడా చేయడం మొదలుపెట్టారు నేటిజన్స్. అయితే ఈ విషయంపై స్పందించిన అపర్ణ .. శరీర బరువుకు.. ప్రతిభకు సంబంధం లేదని తేల్చి చెప్పింది.
ఒక వ్యక్తి బరువు పెరగడానికి తమ శరీరంలో అనేక సమస్యలు కారణమవుతూ ఉంటాయని , నేను బొద్దుగా ఉన్నాను అంటే కేవలం అది దానివల్లే అని తెలియజేసింది. అదే లుక్కుతో సినిమాలలో నటించమని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని తన శరీరం యొక్క ఆకారం పై వస్తున్న కామెంట్స్ ని చూసి మొదట చాలా ఇబ్బంది పడ్డాను అని తెలియజేసింది. ఈ ఫోటోలను చూసి అమ్మ పాత్రలలో నటించమని కామెంట్లు చేస్తున్నారని తెలిపింది. అయితే సన్నగా ఉంటేనే హీరోయిన్లుగా భావిస్తారా.. సన్నగా ఉంటేనే హీరోయిన్గా అవకాశాలు దొరుకుతాయి ఏంటి అంటూ ఫైర్ అయ్యింది అపర్ణ.