
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ షో లో కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇటీవలే విడుదలైన ఢీ షో ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ ప్రోమో లో భాగంగా జానీ మాస్టర్ కొంతమందికి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవలి కాలంలో ఎంతో మంది ఢీ షో పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. డాన్స్ షో అని చెప్పుకునే ఢీ షో లో డాన్స్ తప్ప మిగతా అంతా కనిపిస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
కంటెస్టెంట్ డాన్స్ చేయడం మానేసి సర్కస్ చేస్తున్నట్లుగా స్టంట్స్ చేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే వీటిపై స్పందించిన జానీ మాస్టర్ అందరూ రాసుకోండి.. ఇంకోసారి ఢీ స్టేజి గురించి తప్పుడు వార్తలు రాస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఢీ షోతో జానీ మాస్టర్ కి ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. కప్పుడు ఇదే షోలో కంటెస్టెంట్ గా వచ్చాడు ఇక ఎన్నో సీజన్ల నుంచి జడ్జిగా కొనసాగుతున్నాడు.