అయితే ఈ రెండు చిత్రాల ఫలితాలు ప్రభాస్ క్రేజ్‌ను ఏమాత్రం తగ్గించలేదు. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా ప్రభాస్ నిలిచాడు. ఒక్కో సినిమాకు ప్రభాస్ దాదాపు రూ.120 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లైన్స్‌లో ఉన్న సినిమాలే దాదాపు రూ.2000కోట్ల వరకు బిజినెస్‌ను జరుపుకుంటాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవలే ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ అరుదైన ఘనతను సాధించాడు.
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతినెల దేశంలోని సెలబ్రిటీల గురించి సర్వే నిర్వహించి.. టాప్ పొజిషన్‌లో ఉన్న సెలబ్రెటీల జాబితాలను విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆగస్టు నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ మేల్ తెలుగు ఫిలిం స్టార్స్ సర్వే జాబితాను ఆర్మాక్స్ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో ప్రభాస్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్, అల్లుఅర్జున్, రామ్‌చరణ్ వరుస స్థానాల్లో ఉన్నారు. జూలై నెలలో కూడా ప్రభాస్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక హీరోయిన్‌లలో సమంత మొదటి స్థానంలో ఉండగా కాజల్ రెండవ స్థానంలో ఉంది.
ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది ప్రాజెక్ట్ కే.ఈ సినిమాని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.
సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో రూపొందుతోంది. ఈ మూవీ ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా ని ఇప్పటివరకు భారత దేశంలో ఎవరూ రూపొందించని విజువల్స్ తో ప్రాజెక్ట్ కే ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ అని స్వయంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రకటించారు. దాంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఇక క్యాస్ట్ విషయంలో కూడా ఈ సినిమా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. దిశా పటాని రెండో హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం.
అయితే ఈ మధ్యనే ఈ సినిమాలో ఉపయోగించేందుకు ఆనంద్ మహీంద్రా ను తమ కార్లకు సంబంధించి ఇంజనీర్ల సహాయం కావాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆయనను అడిగారు. డైరెక్టర్ రిక్వెస్ట్ కి ఆనంద్ మహీంద్రా కూడా సానుకూలంగా పని స్పందించారు.మీకు అవసరమైన సాంకేతికతను మేము అందిస్తామని కూడా మాట ఇచ్చాడు. అయితే ఈ సినిమాపై ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ ఉంది. ప్రాజెక్టు కే సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టడం ఖాయమని చాలామంది అంటున్నారు. అయితే అనుకోకుండా ప్రాజెక్ట్ కె సినిమా ప్రమాదంలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్యనే రిలీజ్ అయిన ఒకే ఒక జీవితం స్టోరీ లైన్ ప్రాజెక్ట్ కే సినిమా కి దగ్గరగా ఉంటుందట. ఒకే ఒక జీవితం సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందింది. అమ్మ కోసం హీరో టైం మిషన్ లో కాలాన్ని వెనక్కి తీసుకు వెళ్తాడు.
సైన్స్ ఫిక్షన్ స్టోరీకి అమ్మ సెంటిమెంట్ ను జోడించి ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ప్రాజెక్టు కే స్టోరీ లైన్ కూడా దగ్గర దగ్గరగా ఇలానే ఉంటుందట. అయితే ఈ సినిమా కూడా టైం ట్రావెల్ కాన్సెప్టు తోనే రూపొందిస్తున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఒకవేళ ఈ రెండు సినిమా స్టోరీ లు సిమిలర్ అయితే ప్రాజెక్ట్ కే సినిమా నష్టపోవడం ఖాయం అంటున్నారు సినీ వర్గాలు. ఎందుకంటే రెండు సినిమాల కథలు సేమ్ స్టోరీలైన్ ఉంటే ప్రేక్షకులు ఆప త్రిల్ ని కోల్పోతారు. ఒకవేళ ప్రాజెక్ట్ కే సినిమా భారీ బడ్జెట్ సినిమా కాబట్టి విజువల్స్ పరంగా బాగున్నప్పటికీ స్టోరీ పరంగా ప్రేక్షకులు సాటిస్ఫై కాలేకపోతారు. అయితే టాలీవుడ్ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఈ వార్త ప్రాజెక్ట్ కే మూవీ యూనిట్ లో వణుకు పుట్టిస్తుందని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే దర్శక నిర్మాతల పరిస్థితి ఏంటి? అని సినీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు.మరి ప్రాజెక్టు కే విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.