తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న డాన్స్ షో లలో ఒకటైన   'ఢీ' షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..అయితే గత కొన్ని సంవత్సరాల నుండి సీజన్ల వారీగా కొనసాగుతున్న ఈ షో..ప్రేక్షకాదరణ భారీ స్థాయిలో సొంతం చేసుకుంది. డాన్స్ అంటే అందరికి ఇష్టమే. అందులోను డాన్స్ చేసే టాలెంట్ ఉన్నవారిని ఎంకరేజ్ చేస్తూ వస్తున్న ఈ ఢీ షోని కూడా సపోర్ట్ చేస్తున్నారు ఆడియెన్స్. ఇప్పటివరకూ పదమూడు సీజన్లు పూర్తిచేసుకున్న ఢీ షో.. ఇప్పుడు ‘డాన్సింగ్ ఐకాన్’ పేరుతో 14వ సీజన్ రన్ అవుతోంది. అయితే.. ఈ షోలో కంటెస్టెంట్స్ పాల్గొని కెరీర్ లో సక్సెస్ అయిన కొరియోగ్రాఫర్స్ అంతా అప్పుడప్పుడు ఢీలో జడ్జిలుగా వ్యవహరిస్తుంటారు.

కాగా  ప్రతి బుధవారం ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోకి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రోమోస్ రిలీజ్ చేస్తుంటారు నిర్వాహకులు. ఈ వారానికి సంబంధించి కూడా కొత్త ప్రోమో వదిలారు. అయితే.. ఈ వారం డాన్సింగ్ ఐకాన్ జడ్జిలుగా గణేష్ మాస్టర్, హీరోయిన్ శ్రద్ధాదాస్ లతో పాటు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కనిపించారు. ఇకపోతే ఈ క్రమంలో కంటెస్టెంట్స్ అంతా అదిరిపోయే పర్ఫామెన్స్ చేశారు.  ఓ కంటెస్టెంట్ పెర్ఫార్మన్స్ చూసి జానీ మాస్టర్ కంటతడి పెట్టుకున్న సీన్ ప్రోమోలో హైలెట్ అవుతోంది. అయితే ఇంతకీ జానీ మాస్టర్ ఎందుకు ఎమోషనల్ అయ్యాడంటే కారణం.. స్టేజిపై జానీ మాస్టర్ లైఫ్ జర్నీని పెర్ఫార్మన్స్ గా చూపించడమే.

ఇక ఆ పెర్ఫార్మన్స్ చూసి జానీ మాస్టర్ తన లైఫ్, కెరీర్ లోని స్ట్రగుల్స్ ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిపోయాడు. అయితే అప్పటి జ్ఞాపకాలను తలచుకున్న జానీ మాస్టర్.. కన్నీరు పెట్టుకున్న తర్వాత స్టేజిపై డాన్స్ ఇరగదీశాడు. అంతేకాదు అలాగే ఈ ఢీ షో గురించి ఎవరూ తప్పుగా మాట్లాడొద్దని చెప్పాడు.ఇదిలావుంటే  ప్రస్తుతం ఈ వారం ప్రోమోలో జానీ మాస్టర్ ఎమోషనల్ అయిన సీన్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఆఐతే  జానీ మాస్టర్ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూ.. సక్సెస్ ఫుల్ కెరీర్ లీడ్ చేస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: