కాగా ఈ వీరిద్దరూ కలిసి నటించిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇది వలే విడుదల అయ్యి పరవాలేదు అనిపించిందట . ఇది ఇలా ఉంటే తాజాగా ముంబైలోని కరణ్ జోహార్ ఆఫీస్ ముందు దర్శకుడు అయాన్ ముఖర్జీ,రణ్ బీర్ దంపతులు సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే రణ్ బీర్ చేసిన పనికి నెటిజెన్స్ ట్రోలింగ్స్ చేస్తున్నారట .
కరణ్ జోహార్ ఆఫీస్ వద్ద మీడియాతో మాట్లాడటానికి అలియా రణ్ బీర్ సిద్ధమయ్యారని తెలుస్తుంది.. ఈ క్రమంలో రణ్ బీర్ క్రాఫ్ ని అలియా సరిచేసే ప్రయత్నం చేసిందట. రెండవ సారి కూడా రణ్ బీర్ క్రాఫ్ ని సెట్ చేయడానికి అలియా ప్రయత్నించడంతో రణ్ బీర్ వెంటనే ఆమె చేయిని పక్కకు తోసేయడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ ఈ జంట పై ట్రోలింగ్స్ చేస్తున్నారట . కొందరు నెటిజన్స్ ఆలియా కి మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు రణ్ బీర్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారుట.
కాగా గత కొద్ది రోజులుగా ఆలియా భట్ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరొకసారి ఈ జంట ట్రోలింగ్స్ ఎదుర్కొంది. ఇకపోతే ఈ జంట తాజాగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమాపై విడుదలకు ముందే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటుంది అని చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా భావించారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా ఇలా కలెక్షన్ల విషయంలో, అలాగే విడుదలైన మొదటి రోజు నెగిటివ్ టాక్సెస్ సొంతం చేసుకోవడంతో కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారట..