కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కే జి ఎఫ్ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పలు రికార్డులను సైతం సృష్టించింది. కన్నడ సినీ చరిత్రలోనే అత్యధిక వసూలను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఈ సినిమాని ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. దీంతో ఇలాంటి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ పీరియాడికల్ డ్రామా స్థాయిలో తెరకెక్కించడం మొదలుపెట్టారు.


ఇదే తరహాలో వస్తున్న చిత్రం కబ్జా... ఈ సినిమాని కన్నడ రియల్ స్టార్ గా పేరు సంపాదించిన ఉపేంద్ర హీరోగా నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా శ్రీయ నటిస్తుంది. ఆర్ చంద్రు దర్శకత్వం వహించిన ఈ సినిమా మాన్ ఇండియా స్థాయిలో ఒకేసారి ఏడు భాషలలో విడుదల చేయబోతున్నారు. ఇక ఈ చిత్రంలో కిచ్చా సుదీప్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ ని విడుదల చేయడం జరిగింది. 1942లో జరిగిన ఒక యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తుంది.

రైస్ ఆఫ్ ది ఇండియన్ గ్యాంగ్స్టర్ రియల్ స్టోరీగా తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ చూస్తే.. హీరో యశ్ నటించిన కే జి ఎఫ్ సినిమా అని తలపించేలా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా టీజర్ లోని సన్నివేశాలు చూస్తుంటే అదే ఫీలింగ్ కలుగుతుందని చెప్పవచ్చు. కానీ డైరెక్టర్ చందు మాత్రం ఇది కొత్త కథ అన్నట్లుగా తెలియజేస్తున్నారు. ఈ చిత్రంలోని డైలాగ్స్ మాత్రం వినిపించకుండా కేవలం సంగీతంతోని ఈ సినిమా టీజర్ ని చూపించారు. మరి ఈ సినిమా డేటు మాత్రం చిత్ర బృందం ఇంకా ప్రకటించలేదు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో అని ఉపేంద్ర అభిమానులు సైతం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: