ప్రస్తుతం హీర్ అచ్రా బాలీవుడ్ లో ప్రత్యేకంగా వినిపిస్తున్న పేరు. ముంబై కు చెందిన ఈ అందాల తార మోడల్ గా కెరీర్ ప్రారంభించి తన నటనతో ఏకంగా బాలీవుడ్ నుండి వరుస ఆఫర్స్ సొంతం చేసుకుంది. కొద్దికాలంలోనే స్టార్ గా పేరు పొందాలంటే దాని వెనక నిరంతర కృషి, నటన నైపుణ్యం ఉంటే చాలు అని నిరూపించిన ఘనత హీర్ అచ్రాకే సాధ్యం. ఒకవైపు మోడలింగ్ లో, మరోవైపు సినిమాలలో రాణించాలంటే అది ఈ నటికే సాధ్యం.

ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా కూడా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ తో టాప్‌ సోషల్‌ సెలబ్రిటీగా అలరిస్తుంది. ప్రముఖ గుజరాతీ చిత్రాలు సూర్యాంశ్, పటేల్‌ వర్సెస్‌ పెట్రిక్‌లను తన ఖాతాలో వేసుకుంది.  ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఫేమస్‌ యాక్టర్‌ టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి ఒక యాడ్‌ షూట్‌ చేసింది. అటు సినిమాలు ఇటు యాడ్స్‌తో తనకంటూ ప్రత్యేకమై ఇమేజ్‌ను పెంచుకుంటుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ బ్రాండ్‌ లైనటువంటి సన్ సిల్క్, నివియా, మియా జ్యువెలరీ తదితర బ్రాండ్‌లకు బ్రాండ్‌ అంబాసిడర్‌ డా, యాడ్‌ మోడల్‌గా పనిచేయడం విశేషం.

నటన, మోడలింగ్‌ అంశాల్లో తన ప్రయాణానికి టెమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో 2018 మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ బిరుదును పొందింది. అంతేకాదు.. నటన, మోడలింగ్‌ అంశాల్లో తన ప్రయాణానికి టెమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో 2018 మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ బిరుదును పొందింది.   ఎఫ్‌బీబీ ఫెమీనాతో పాటు మిస్‌ గుజరాతీ ఫైనలిస్ట్‌లలో స్థానం సంపాదించుకుంది. గ్లామర్‌ ఫీల్డ్‌లో ఈ యువ అందాల తారతో విభిన్నమై ప్రాజెక్ట్‌లను నిర్వహించడానికి ప్రముఖ ప్రొడక్షన్‌లు సంప్రదిస్తున్నాయి. ఎఫ్‌బీబీ ఫెమీనాతో పాటు మిస్‌ గుజరాతీ ఫైనలిస్ట్‌లలో స్థానం సంపాదించుకుంది. హీర్‌ అచ్రా చేయబోయే యాడ్స్, మోడలింగ్‌ తదితర వ్యవహారాలను ముంబైకి చెందిన ప్రముఖ ఏజెన్సీ ‘‘రన్ వే లైఫ్‌స్టైల్‌’’ పర్యవేక్షిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: