బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది విష్ణు ప్రియ. సుధీర్ తో కలిసి ఆమె హోస్ట్ చేసిన 'పోవే పోరా' షో ఎంత పాపులర్ అయిందో మనందరకు తెలిసిందే.
ఈ షోతో విష్ణు ప్రియకి మంచి పేరొచ్చింది. మెల్లగా మరిన్ని అవకాశాలు కూడా దక్కించుకుంది. అప్పట్లో సుధీర్ తో ఆమె డేటింగ్ చేస్తుందని వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. అయితే కొన్నాళ్లకు వీరిద్దరూ కలిసి షో చేయడం ఆపేశారు. కామెడీ షోలలో ఎక్కువగా కనిపిస్తుండేది విష్ణు ప్రియ.
ఆమె హైట్ పై, ముక్కు మీద కామెంట్స్ కూడా చేసేవారు కంటెస్టెంట్స్. కానీ విష్ణుప్రియ పెద్దగా పట్టించుకునేది కాదు. ప్రస్తుతం ఈమె ఆల్బమ్ సాంగ్స్ లో నటిస్తోంది. ఇటీవల విడుదలైన 'వాంటెడ్ పండుగాడ్' సినిమాలో ఈ బ్యూటీ కనిపించింది. అలానే 'జరీ జరీ' అనే ఆల్బమ్ సాంగ్ తో మెప్పించింది. ఈ సాంగ్ లో ఆమె గ్లామర్ షోకి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొందట విష్ణు ప్రియ. ఇందులో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా..? అని యాంకర్ ప్రశ్నించగా.. కచ్చితంగా ఉందని, కానీ అది వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుందని చెప్పింది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడుగుతారని.. నచ్చితే ఓకే చెప్పి అవకాశాలు అందుకుంటారు లేదంటే లేదని చెప్పింది. తనకు కూడా చాలా మంది అదే ఆలోచనతో సంప్రదించారని..
కానీ నేను ఒప్పుకోలేదని చెప్పింది. సినిమా ఇండస్ట్రీతో పాటు చాలా రంగాల్లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని తన అభిప్రాయాన్ని వెల్లడించిందట.. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా.. హార్మోన్స్ కంట్రోల్ లో ఉంచుకోవాలని ఒక సజెషన్ కూడా ఆమె ఇచ్చింది.ఇప్పటికే పలు హాట్ డాన్స్ లతో విష్ణు ప్రియా ఎంతగానో మెప్పించింది. ఈమే హాట్ డాన్సలకు కుర్రకారుకు నిద్ర పట్టడం లేదు. అంత హాట్ గా డాన్స్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది...