అంతేకాదు హిందీలోను పలు రకాల సినిమాలు చేసి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనా.. ప్రస్తుతం తన సినీ కెరియర్ సెకండ్ ఇన్నింగ్స్ ను జెట్ స్పీడ్ లో తీసుకుపోయే విధంగా ప్లాన్ చేసుకుంది.
కాగా సెప్టెంబర్ 16న మీనా పుట్టినరోజు. ఆమె సెప్టెంబర్ 16 తన 46వ పుట్టినరోజును గ్రాండ్ గా జరుపుకుంది. కాకపోతే ప్రతి సంవత్సరం తన బర్త డే ను తన భర్త పక్కనే ఉండి జరిపించేవాడు. కానీ ఈ సంవత్సరం ఆయన ఊహించిన విధంగా మరణించడంతో మీనా తన పుట్టిన రోజును తన ప్రాణ స్నేహితులతో చేసుకుంది . అంతేకాదు అసలు ఈ సంవత్సరం మీనా పుట్టినరోజు జరుపుకోనని మొండి గా కూర్చుంది. కానీ తన ప్రాణ స్నేహితులు పట్టుపట్టి ఆమెకు సర్ప్రైజ్ గా పుట్టినరోజు వేడుకలను జరిపారు. దీంతో పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇవి క్షణాల్లోనే వైరల్ గా మారాయి.
అయితే భర్త మరణం తర్వాత మీనా ఇలా సంతోషంగా ఎప్పుడూ లేదని ఫస్ట్ టైం ఇంత హ్యాపీగా మీడియా ముందు కనిపిస్తుందని ఆమె అభిమానులు అంటున్నారు. మనకు తెలిసిందే ఇటీవల తన భర్త విద్యాసాగర్ మరణించారు. ఇంకా ఆ బాధ నుంచి మీనా కోలుకో లేదు .కానీ, ఆమెను ఆ బాధ నుంచి బయటకు తెచ్చేందుకు ఆమె స్నేహితురాల్లు రంభ, స్నేహ, సంఘవి, సంగీత, రాధిక అందరూ ఆమెను ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మీనా బర్త డే వేడుకలను సర్ప్రైజ్ గా ప్లాన్ చేసి ఆమెకు జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు వేడుకలను చేశారు. అయితే దీనిపై కొందరు నెగటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. భర్త చనిపోయి కనీసం సంవత్సరం కూడా కాకముందే మీన ఇలా నవ్వుతూ తూలుతూ ఉండడం ఏంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మీనా పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి