![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/samantha-second-marrige5c06461d-74f7-4230-83a5-3277d49a05e6-415x250.jpg)
ఇక సమంత,నాగచైతన్య విడాకులు తీసుకొని చాలా డిస్టర్బ్ అయ్యారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆమె సద్గురు ప్రవచనాలు వింటూ ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడం జరిగిందని ఎన్నోసార్లు తెలియజేసింది. ఇక సమంత తన స్నేహితులతో కలిసి టూర్లు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ విషయాలను పక్కన పెట్టేసింది సమంత. అయితే సమంత కుటుంబం క్రిస్టియన్ కావున సమంత ఒక హిందువుని వివాహం చేసుకోవడానికి సమంత కుటుంబికులు అంగీకరించలేదని వార్త కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ఒకవేళ సమంత రెండో వివాహం చేసుకుంటే ఒక క్రిస్టియన్ అబ్బాయినే వివాహం చేసుకోవాలని కుటుంబ సభ్యులు సైతం ఆమెను కోరుతున్నట్లుగా సమాచారం.
అయితే సమంత సద్గురు బాబా మాటలు విని రెండో వివాహం చేసుకుంటుందా అని అభిమానులలో ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతోంది. అయితే మరి కొంతమంది మాత్రం సమంత అసలు వివాహ ఆలోచన లేదని ఇదంతా కావాలనే ఎవరు సృష్టిస్తున్నారని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక సమంత గతంలో తనపై వచ్చిన రూమర్లు అన్నిటిని కూడా కొట్టి కొట్టివేయడం జరిగింది. మరి సమంత ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతుందేమో చూడాలి మరి. ఏది ఏమైనా సమంత నాగచైతన్య విడిపోవడం అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేస్తోందని చెప్పవచ్చు. ప్రస్తుతం సమంత, నాగచైతన్య సినిమాలలో చాలా బిజీగా ఉన్నారు.