నేడు సినిమా విడుదల సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్ లో నాగశౌర్య మాట్లాడుతూ సినిమాలో నా పాత్ర పేరు కృష్ణ.. నేను ఒక బ్రాహ్మణ కుర్రాడిని. నా పాత్ర కోసం చాలా హోంవర్క్ చేశాను. కొందరు బ్రాహ్మణుల యొక్క బాడీ లాంగ్వేజ్ ని పట్టుకున్నాను, వారిలా నడవడం నేర్చుకున్నాను. వారిలా మాట్లాడడం నేర్చుకున్నాను అంటూ నాగశౌర్య చెప్పుకొచ్చాడు. ఆ సమయంలోనే ఒక సీనియర్ జర్నలిస్టు మైక్ తీసుకొని నేను ఒక బ్రాహ్మిన్ ని నా నడక తీరు మీ నడక వలె ఉంటుంది.. నేను మాట్లాడే తీరు మీరు మాట్లాడినట్టే ఉంటుంది. బ్రాహ్మిన్ అయినంత మాత్రాన ప్రత్యేకంగా ఏముంటుందని మీరు స్పెషల్ గా నేర్చుకున్నారు అంటూ నాగశౌర్య ని ప్రశ్నించాడు.
దాంతో నాగ శౌర్య తో పాటు అక్కడున్న వాళ్లంతా కూడా ఒక నిమిషం షాక్ అయ్యారు. ఈ టాపిక్ మెల్ల మెల్ల గా ఎక్కడెక్కడికో వెళ్ళింది. సమరసింహా రెడ్డి సినిమా చేస్తున్న సమయం లో రెడ్డి వాళ్లని చూసి బాలకృష్ణ నడవడిక, మాట తీరు నేర్చుకున్నాడా.. చౌదరి సినిమా చేసినప్పుడు ఆ హీరోలు చౌదరి ల యొక్క మాటలు నేర్చుకున్నారా అంటూ జర్నలిస్టు కాస్త సీరియస్ గానే ఈ విషయాన్ని తీసుకెళ్లాడు. అంటే సుందరానికి సినిమా సమయం లో కూడా తాను ఈ విషయాన్ని లేవనెత్తానని బ్రాహ్మణులైనంత మాత్రాన ప్రత్యేకమైన నడవడిక ఏముంటుందని మీరు ఆ పాత్ర కోసం స్పెషల్ గా నేర్చుకుంటున్నారంటూ ఆ జర్నలిస్టు ప్రశ్నించడంతో నాగశౌర్య ఏదో మ్యారేజ్ చేసినట్లుగా సమాధానం చెప్పేసాడు. వెంటనే టాపిక్ మార్చాలంటూ అక్కడ ఉన్న వారు జర్నలిస్టుకి సూచించారు మొత్తానికి నాగశౌర్య కి ప్రెస్ మీట్ లో జర్నలిస్టు కాస్త ఇబ్బందిని కలిగించాడు అనడం లో సందేహం లేదు.