కామ్న జెఠ్మలాని .. ఈ ముద్దగుమ్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. గోపిచంద్ సరసన రణం వంటి సూపర్ హిట్ సినిమాతో గుర్తింపు పొందింది.
ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తూనే.. ఆకస్మాత్తుగా వెండితెరకు దూరమయ్యారు. అయితే వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడిపిన కామ్నా.. అదే సమయంలో ఎన్నో పెద్ద సినిమాలను కూడా మిస్ చేసుకుందట. తనది సింధీ ఫ్యామిలీ అని.. మా కుటుంబంలో 21 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేస్తారని.. కానీ మా అమ్మ నాకు సపోర్ట్ చేసిందని కామ్నా జెఠ్మలానీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే కెరీర్ టాప్లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకోని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారట.
అయితే ఈ అమ్మడి లైఫ్‌లో లవ్ కూడా ఉందట. కామెడీ హీరో గా ఫేమస్ అయిన ఆయన తమ్ముడితో ప్రేమలో పడింది అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. కొంతకాలం బాగానే సాగిన వీర ప్రేమ వ్యవహారం.. ఆ తర్వాత బెడిసి కొట్టింది. హీరో తమ్ముడు కొత్త అందాలకు ఆకర్షితుడు కావడంతో కామ్నకి హ్యాండిచ్చాడట. ఈ క్రమంలో మోసపోయాను అంటూ కామ్న జఠ్మలాని సినీ ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది అంటూ అప్పట్లో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అప్పట్లో తన పర్సనల్, కెరీర్ గురించి మాట్లాడిన కామ్నా.. మోడలింగ్, డ్యాన్సర్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసానని.. మొదటి జీతం రూ. 300 అని తెలిపింది.
అలాగే తాను పడిన కష్టం గురించి ముందే తన భర్తకు చెప్పానని కామ్నా అన్నారు. నిశ్చితార్థం సమయంలో చేతిలో మూడు సినిమాలు ఉన్నాయని.. ఫుల్ బిజీగా ఉన్న టైంలోనే పెళ్లి చేసుకున్నానని. కానీ ఇప్పటికీ నటన అంటే పిచ్చి అని చెప్పుకొచ్చింది. తనకు సినిమాలు చేయమంటే ఇష్టమని.. అందుకు తన భర్త కూడా సపోర్ట్ ఇస్తారని చెప్పారట.. ప్రస్తుతం తనకు పూరీ జగన్నాథ్ సినిమాలో నటించాలనుందని.. అలాగే రాజమౌళి సినిమాలో ఒక చిన్న పాత్ర అయిన చేయాలనుందని తెలిపిందట.. స్పెషల్ సాంగ్స్ కూడా తనకు చేయాలని ఉందంటూ అప్పట్లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.