దీనికితోడు ఈ 'శాకిని డాకిని' చిత్రానికి రూ. 3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ, మొదటి రోజు నుంచి ఈ సినిమాకి బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ?, 'శాకిని డాకిని' పరిస్థితి ఏమిటి ?, ఈ సినిమా నిర్మాతకు లాభాలు వస్తాయా ? లేక, నష్టాలే మిగిలే ఛాన్స్ ఉందా ? చూద్దాం రండి.
ముందుగా ఈ సినిమా 7 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
నైజాం 0.27 కోట్లు
సీడెడ్ 0.23 కోట్లు
ఉత్తరాంధ్ర 0.9 కోట్లు
ఈస్ట్ 0.14 కోట్లు
వెస్ట్ 0.09 కోట్లు
గుంటూరు 0.9 కోట్లు
కృష్ణా 0.13 కోట్లు
నెల్లూరు 0.16 కోట్లు
ఏపీ + తెలంగాణలో 7 డేస్ కలెక్షన్స్ గానూ రూ. 99 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 1.98 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.16 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 7 డేస్ కలెక్షన్స్ గానూ రూ. 1.25 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 7 డేస్ కలెక్షన్స్ గానూ 'శాకిని డాకిని' రూ. 2.37 కోట్లను కొల్లగొట్టింది.
మొత్తమ్మీద 'శాకిని డాకిని' చిత్రానికి వస్తున్న కలెక్షన్స్ ను బట్టి.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపు కష్టమే. ఒకవేళ అవ్వాలి అంటే మరో రూ. 2.01 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ, మొదటి 7 రోజులకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం భారీగా నష్టపోనుంది. ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ కాకపోవడంతో 'శాకిని డాకిని' కలెక్షన్స్ పరంగా కూడా నిరాశ పరిచింది. ఈ సినిమా కోసం నిర్మాత సునీత భారీగానే ఖర్చు పెట్టింది. పైగా ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున చేసింది నిర్మాత సునీత. సురేష్ బాబు ఈ సినిమా వర్కౌట్ కాదు అని చెప్పినా… నివేదా - రెజీనా ల పై నమ్మకం ఉంచి ముందుకు పోయింది నిర్మాత సునీత. కానీ, చివరకు నష్టాల దెబ్బకు ఆమె రోడ్డు మీదకు వచ్చిన పరిస్థితి వచ్చేసింది. మొత్తమ్మీద నిర్మాత సునీత ను ఈ ఇద్దరు హీరోయిన్లు నివేదా - రెజీనా నిండా ముంచేశారు.