మెగా హీరో వరుణ్ తేజ్ కెరియర్ మొదట్లో నుంచి విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత వరస సినిమాలతో దూసుకుపోతూ ఉన్నారు. గద్దల కొండ గణేష్ చిత్రంతో తనలోని మరొక కోనాన్ని బయటపెట్టాడు వరుణ్ తేజ్. ఆ సినిమాలో మాస్ క్యారెక్టర్లు అద్భుతమైన నటనను ప్రదర్శించాడు . ఈ మధ్య వచ్చిన గని సినిమా భారీ డిజాస్టర్ ను చవిచూసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన f-3 సినిమా కామెడీ పరంగా బాగున్న ఈ హీరోకి పెద్దగా సక్సెస్ అవ్వలేదని చెప్పవచ్చు. అయితే తాజాగా ఇప్పుడు ఒక బయోపిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు వరుణ్ తేజ్.


ఈ క్రమంలోనే తాజాగా వరుణ్ తేజ్ మరొక ప్రయోగాత్మకంగా సినిమాకి తెర లేపారు.ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ 13వ చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక కొత్త పోస్టర్ను కూడా చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. ఇక ఇదివరకే ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియోని కూడా విడుదల చేసి మరింత ఆసక్తిని పెంచేసింది.


ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా ఒక ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ కథపై చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురుచూస్తున్నారు. తాజాగా వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో డిపిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సింబల్ ని సెట్ చేసుకోవడం జరిగింది. ఆత్మనిర్బన్ భారత్ లో భాగంగా IAF పిలుపుమేరకు వరుణ్ తేజ్ తన సోషల్ మీడియాలో డిపిని మార్చానని తెలియజేశారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి గొప్ప  నివాళిగా ఈ సినిమా ఉండబోతోంది అని తెలియజేశారు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా తన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని తెలియజేశారు. ఇందుకోసం ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంటున్నానని వరుణ్ తేజ్ తెలిపారు. ప్రస్తుతం తన చేసినట్టు వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: