![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/godfather-movie-malayalam03233b7c-9b76-4814-aed6-1830672c1a9d-415x250.jpg)
గాడ్ ఫాదర్ చిత్రాన్ని డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మలయాళం లో మోహన్ లాల్ హీరోగా లూసిఫర్ సినిమాలో నటించారు. ఈ చిత్రం అక్కడ మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెరపై ప్రసారమైందంటే చాలు మంచి టిఆర్పి రేటింగులు సొంతం చేసుకుంటోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని మోహన్‌లాల్ నటనకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులయ్యారని చెప్పవచ్చు.
మోహన్ లాల్ ఈ చిత్రాన్ని మలయాళంలోని ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని నటించడం జరిగింది. అయితే తెలుగు హీరో చిరంజీవి తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను మార్చి డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించడం జరిగింది. అందువల్లే ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాని మలయాళం లో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవికి మాత్రం మలయాళం లో పెద్దగా స్కోప్ లేదని చెప్పవచ్చు.. ఇక కేవలం సల్మాన్ ఖాన్, నయనతార ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని మలయాళం లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే అభిమానులు మాత్రం ఈ సినిమాని మలయాళం విడుదల చేయకపోవడం మంచిదని భావిస్తున్నారు.