
అయితే మలయాళంలో అయితే ఈ తరహా సీన్ లు మరియు పాత్రలు చాలానే వచ్చాయి. కానీ ఇక్కడ టాలీవుడ్ లో కొన్ని రకాల సన్నివేశాలను అంగీకరించరు. ఈ కారణం వల్లనే చాలా సినిమాలు ప్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే గాడ్ ఫాదర్ లో వివేక్ పాత్రను సత్యదేవ్ చేస్తున్నారు. ఇప్పటికే సత్యదేవ్ ఒక నటుడిగా తానేమిటో నిరూపించుకుని ఉన్నాడు. విలన్ పాత్ర చేయడం అంటే వేరు... ఇలాంటి విలన్ పాత్రను చేయడం వేరు. అయితే ఈ సినిమాలో సత్యదేవ్ పాత్ర కనుక హిట్ అయితే తనకు దేశ వ్యాప్తంగా మంచి నటుడిగా పేరు రావడమే కాకుండా, బాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా మంచి అవకాశాలు వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇక చిరంజీవికి వీరాభిమాని అయిన సత్యదేవ్ అతన్నీ ఢీకొట్టే పాత్రలో నటించడం చాలా సర్ప్రైజ్ అని చెప్పాలి. మరి ఈ సినిమాలో తెలుగు ప్రజలకు నచ్చే విధంగా పాత్రలో ఏమైనా మార్పులు చేశారా ? లేదా అన్నది చూడాలి. ఒకవేళ మార్చకుండా ఉంటే ఎంత వరకు తెలుగు ప్రజలు తన పాత్రను అంగీకరించి సినిమాకు మంచి వసూళ్లను ఇస్తారు అన్నది చూడాలి. కాగా ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న దేశ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.